బిగ్ బ్రేకింగ్: మోడీ ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్తాడనుకోలేదు

August 06, 2020

ఒకవైపు కేసులు ఊహించిన దానికన్నా విసృతంగా పెరుగుతున్నాయి. కరోనాలో భారతదేశం పీక్స్ కి చేరుకుంటోంది. ఇలాంటి విపత్కర సమయంలో కేంద్రం సంచలన, అనూహ్య నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ 3.0 ముగిసినా రైళ్లు ప్రారంభం కాకపోవచ్చు  అని అందరూ అనుకుంటున్న సమయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం వెల్లడించింది. ఎల్లుండి నుంచి భారతీయ రైల్వేలు తిరిగి తమ సేవలు ప్రారంభించడానికి అనుమతించింది. అంతేకాదు, ఈ మేరకు రైల్వే శాఖ రిజర్వేషన్ల వివరాలతో ప్రకటన కూడా విడుదల చేసింది.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి 15 రైళ్లను దేశంలోని ముఖ్యనగరాలకు నడపనుంది. ఎల్లుండి నుంచి ఈ రైల్వే సర్వీసులు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఈ రైళ్లకు రిజర్వేషన్లు ప్రారంభం అవుతాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణకుల ఆరోగ్యం కాపాడుకుంటూనే తన సేవలను రైల్వే అందించనుంది. 

తొలి దశలో అన్ని రైళ్లు ప్రారంభించడం లేదు. తొలుత 15 సర్వీసులు (రిటర్న్ తో కలిపి 30) మాత్రమే ప్రారంభించనుంది. రాజధాని ఢిల్లీ నుంచి ఈ రైళ్లు దేశంలోని ముఖ్య నగరాలైన దిబ్రూఘర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచి, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగుళూరు, చెన్నై, త్రివేండ్రం, మడగావ్, ముంబై (సెంట్రల్), అహ్మదాబాద్, జమ్ముతావి నగరాలకు బయలుదేరుతాయి. అక్కడి నుంచి రిటర్న్ సర్వీసులు కూడా నడుస్తాయి. వీటిలో ప్రయాణించడానికి రేపు సాయంత్రం నుంచి రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి. 

దీన్ని బట్టి లాక్ డౌన్ లో కొత్త విధానాలకు తెరలేపనుంది, ఇక దేశమంతటా లాక్ డౌన్ ఉండకపోవచ్చు. కేంద్రం కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయనున్నట్లు అర్థమవుతోంది. నలుగురు కలిసి ప్రయాణించే రైళ్లను ప్రారంభించింది అంటే... కచ్చితంగా లాక్ డౌన్ అనేది ఉండకపోవచ్చు. అతి త్వరలో విమానాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.