బాబుకి బూస్ట్, జగన్ కి బ్యాడ్ న్యూస్

January 26, 2020

పాపం గెలిచిన రెండు వారాలకే తన మిత్రబృందం అయిన కేంద్రం నుంచి జగన్ కి భారీ మొట్టికాయ పడింది. అలవాటైపోయిన ఏడుపుతో యధావిధిగా చంద్రబాబు పాలనలో సోలార్, పవన్ విద్యుత్ కొనుగోళ్ళలో, ఎక్కువ ధరకు ఇచ్చేసారని జగన్ ఆరోపణలు చేశాడు. వీటిపై కొత్త విద్యుత్తు ఒప్పందాలు చేసుకునేలా ఆలోచిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేంద్రం జగన్ ను హెచ్చరించింది. టీడీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని కేంద్ర ఇందన శాఖ స్పందించింది. 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాదక శక్తి సాధించాలనేది కేంద్రం లక్ష్యమని, ఇలాంటి సమయంలో ఏపీ విద్యుత్ కొనుగోలుపై పున:పరిశీలన జరపడం సరికాదని కేంద్ర ఇందన శాఖ ఏపీ ప్రభుత్వానికి తెలుపుతూ... ఈ విషయాలను ముఖ్యమంత్రికి విపులంగా అర్థమయ్యేలా వివరించాలని అధికారులను ఆదేశించింది.
మితిమీరిన లబ్ది చేకూరిందని నిరూపితం అయినపుడు మాత్రమే ఒప్పందాలను పున:పరిశీలన చేయాలని, అంతవరకు గత ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఏ ఒప్పందమైనా సెంట్రల్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరి కమిషన్ నిబంధనల ప్రకారం, బహిరంగ వేలం ద్వారా జరుగుతాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి అర్థమయ్యేలా చెప్పాలని లేఖలో సీఎస్‌కు ఇందన శాఖ సూచించింది.
ఇదిలా ఉంటే... జగన్ ఏదో వారసత్వంగా వచ్చిన రాజకీయం, మొండి పట్టుదల, కులబలంతో పైకి వచ్చారు గాని ప్రభుత్వం నడపడానికి అవసరమైనంత జ్జానం, అనుభవం లేకపోవడంతో ఇలాంటి తప్పులు చేస్తున్నారని అందరికీ అర్థమవుతోంది. రోజురోజుకు జరిగే కొత్త సాంకేతిక ఆవిష్కరణలతో, సామర్థ్యం పెరిగి, పరికరాల వ్యయం తగ్గి, ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. మన మొబైల్ డాటా వినియోగ ఖర్చు ఓ ఉదాహరణ. అలాంటప్పుడు ప్లాంట్ పెట్టేప్పుడు చేసుకునే ఒప్పందాల రేట్లు ఎక్కువ అనిపించడం సాధారణం. అంత మాత్రాన పాత ఒప్పందాలు తప్పని అంటే ... అది అజ్జానం మాత్రమే అవుతుంది.

కనీస అవగాహన లేక జగన్ మీడియాలో మాట్లాడింది, కేంద్రానికి తెలియడంతో ప్రభుత్వ కార్యదర్శికి కేంద్ర ఇంధన శాఖ ఈ లేఖ రాసింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని, ధైర్యాన్ని కాపాడాలని, లేకపోతే భవిష్యత్తులో పెట్టుబడి దారులు ఏపీ వైపు చూడరని అన్నారు. అమరావతి భూముల విషయంలో కూడా ఇదే అజ్జానం చూపారు జగన్. రాజకీయంలో అనేక మాట్లాడతారు... ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడుతూ, మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.