NRI: ప్రపంచాన్ని జయించిన ఆనందం వీరిది 

June 05, 2020

రోజుకు వందల మంది పిట్టల్లా రాలిపోతున్న దేశంలో.... మన వాళ్లు చిక్కుకపోయారు. చదువుకుని ఉన్నతంగా ఎదుగుతాం అని ఇటలీకి వెళ్లిన మనవాళ్లు కరోనా మహమ్మారి ఇటలీని చుట్టుముట్టడంతో అక్కడి వారికే బెడ్స్ లేక కాటికి పోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశస్తులకు వైద్యం చేసే పరిస్థితి వారి కోసం బెడ్లు కేటాయించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన మన వాళ్లు తీవ్ర భయాందోళనళకు లోనయ్యారు.

అసలు తమ పరిస్థితి ఏంటో... ఇంటికి చేరుతామో లేదో తెలియని పరిస్థితి. మొత్తం లాక్ డౌన్ అయిన ఇటలీలో సరుకులు దొరక్క... డబ్బుల్లేక పస్తులున్న వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారి పాలిట దైవంలా మారి కృషి చేసింది. అక్కడ మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియన్ స్టూడెంట్స్ అసోషియేషన్ ఆఫ్ రోమ్. దీని అధ్యక్షుడు గౌతమ్ కృష్ణ మహంకాళి ఇతర సభ్యులు ఇండియన్ ఎంబసీతో, భారత ప్రభుత్వంతో మాట్లాడి ఎట్టకేలకు వారికి ఊపిరి నిలిపారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అందరూ ఇండియాకు క్షేమంగా తిరిగి వచ్చారు. 

ఇండియా నుంచి వెళ్లి వైద్య బృందం అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించి ఇంటికి చేర్చింది. అలాగే ఢిల్లీకి వచ్చాక వారిని 14 రోజుల  క్వారంటైన్ లో ఉంచారు. విదేశ వ్యవహారాల మంత్రి జైశంకర్, ఫారిన్ అండ్ కామన్ వెల్త్ ఆఫీస్ (రోమ్) సహాయంతో ఇండియన్ స్టూడెంట్స్ అసోషియేషన్ రోమ్ విజయవంతంగా ఇండియన్లను ఇక్కడికి చేర్చింది. దీనికి మన తెలుగువాడైన గౌతమ్ కృష్ణ మహంకాళి మన వాడు కావడం విశేషం.