టిక్ టాక్ కూలిపోతే గాని ఆ యాప్ కి జ్జానోదయం కాలేదు

August 14, 2020

ఇండియాలో సినిమా తారలకు కూడా లేని అభిమానులు ఇన్ స్టా గ్రాంకి ఉన్నారు. దేశంలో అత్యధికులు ఆదరణ పొందిన యాప్ టిక్ టాక్. మోస్ట్ యాక్టివ్ యాప్ టిక్. అయితే, దానిని పోరంబోకుల యాప్ గా చూసి ఇన్ స్టా గ్రామ్ వంటి కొన్ని యాప్స్ లెక్క చేసేవి కాదు. కానీ టిక్ టాక్ బ్యాన్ అయినపుడు జరిగిన హడావుడితో అసలు దానికి ఎంత అడిక్ట్స్ ఉన్నారో చాలా మందికి అర్థమైంది. అందుకే ఆ బిజినెస్ ను ట్రాప్ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. 

ఇప్పటికే ఉన్న రొపోసో చెలరేగిపోయింది. కొత్త యాప్ చింగారి దూసుకుపోతుంది. దీంతో ఇన్ స్టాగ్రామ్ కూడా టిక్ టాక్ యూజర్లను ఆకర్షించే ప్రణాళిక మొదలుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌‌లో కొత్తగా ‘రీల్స్‌’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. బుధవారం రాత్రి నుంచి ఈ ఫీచర్‌ను మనదేశంలో అందుబాటులోకి తెచ్చారు.  టిక్‌టాక్‌ తరహాలోనే ఇందులో కూడా 15 సెకన్ల నిడివితో వివిధ రకాలైన బాగ్రౌండ్ సంగీతం, ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ టూల్స్‌ వినియోగించుకుని వీడియోలను చేసుకోవచ్చు.

ఆల్రెడీ ఇప్పటికే డిజిటల్ మీడియాను దున్నేస్తున్న అర్జున్‌ కనుగో, జాహ్నవి (మహాతల్లి), ఇంద్రాణీ బిశ్వాస్ (వండర్‌మున్నా), ఆర్‌జే అభినవ్, బబ్లు, వంటి కంటెంట్ క్రియేటర్లు రీల్స్ మీద పడిపోయారు. రీల్స్‌ ద్వారా కూడా డబ్బులు సంపాదించే ఆప్షన్ క్రియేట్ చేస్తున్నట్లు ఇన్ స్టా యాజమాన్యం వెల్లడించింది. బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో  ‘రీల్స్’ సక్సెస్ కావడంతో మనదేశంలో ఇపుడు మొదలుపెట్టేశారు. మరి ఇది ఎలా చెలరేగిపోతుందో చూడాలి.