పీక్ స్టేజీలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ - ఆ 3 సిటీల నుంచే

August 10, 2020

తక్షణం అంతర్జాతీయ విమానయానం ప్రారంభిస్తున్నట్టు భారతదేశం సంచలన ప్రకటన చేసింది. కొన్ని దేశాలకు మాత్రమే నడుస్తాయి.  ఆయా దేశాలతో చర్చల అనంతరం వీటిని ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో  ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల నుంచి అంతర్జాతీయ విమానాలు తిరుగుతాయి. పారిస్ కు శనివారం నుంచి విమానాలు ప్రారంభం అవుతాయి. ఆగస్టు 1 వరకు మాత్రమే ప్రస్తుతానికి అనుమతించారు. ఎయిర్ ఫ్రాన్స్ 28 విమానాలను నడుపుతుందని విమానయాన శాఖ మంత్రి  హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

"కరోనా పూర్వపు పరిస్థితులు తిరిగి వచ్చే వరకు అంతర్జాతీయ పౌర విమానయానం ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం మధ్యంతరంగా నడుస్తాయ‘‘ని మంత్రి చెప్పారు.  తొలి విడతలో మూడు దేశాలతో అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభమవుతాయి. ఇది అన్ లాక్ 2.0లో భాగం. విమాన సర్వీసులు దశలవారీగా తిరిగి ప్రారంభమవుతాయని అంతకుముందు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించిన అనంతరం విదేశాలలో చిక్కుకున్న 6,80,000 మంది భారతీయులను ఇప్పటివరకు ఇండియాకు తరలించారు. మనదేశం నుంచి 80,000 మంది ఇతర దేశాలకు వెళ్లారు.  

కోవిడ్ -19 యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తరువాత మార్చి 22 నుంచి భారతదేశంలో అన్ని విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి.