IRCTC: కొత్త అప్ డేట్ వచ్చింది !

May 29, 2020

IRCTC : మంగళవారం నుంచి ప్రారంభమైన రైళ్లలో ప్రయాణీకుల కోసం మే 22 నుండి వెయిటింగ్ లిస్టులు కూడా ఉంటాయని భారత రైల్వే ఈ రోజు ప్రకటించింది. మే 22 నుండి ప్రారంభమయ్యే ప్రయాణాలకు మే 15 నుండి బుక్ చేసుకున్న టికెట్ల కోసం ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అయితే ఈ నెంబరు పరిమితంగా ఉంటుంది.
ప్రత్యేక రైళ్ల కోసం వెయిటింగ్ లిస్ట్ ఎసి 3 టైర్‌కు 100, ఎసి 2 టైర్‌కు 50, స్లీపర్ క్లాస్‌కు 200, కుర్చీ కార్లకు 100 చొప్పున, మొదటి ఎసి, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు 20 చొప్పున మాత్రమే వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అంతకుమించి బుకింగ్ యాక్సెప్ట్ అవదు.

ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ (ఆర్‌ఎసి) ఉండదని భారత రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వేషన్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. ‘ఏజెంట్లు’, (ఐఆర్‌సిటిసి ఏజెంట్లు మరియు రైల్వే ఏజెంట్లు) ద్వారా టికెట్ల బుకింగ్ అనుమతించబడలేదు. ఇంతకుమునుపటిలాగా 3 నెలల ముందుగా రిజర్వేషన్లు చేసుకునే ఆప్షన్ కూడా లేదు. గరిష్టంగా ఏడు రోజుల వరకు మాత్రమే రిజర్వేషను చేసుకోవచ్చు.

స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు ఉండవు. ఫేస్ కవర్ ధరించడం తప్పనిసరి, బయలుదేరేటప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవాలి, కో.వి.డ్. లక్షణాలు లేని వారినే రైళ్ళలో అనుమతిస్తారు. రైళ్లలో ఆహారం అందిస్తారు. అప్పటికపుడు ఆర్డరు ఇచ్చి తీసుకోవాలి. మార్చి 22న ఆగిపోయిన రైళ్లను మే 12వ తేదీ నుంచి 15 ప్రత్యేక రైళ్లు న్యూ ఢిల్లీ స్టేషన్ నుంచి దేశంలోని 15 ముఖ్యమైన నగరాలైన దిబ్రుఘర్, అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడగావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ముతావిలను కలుపుతూ ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్నాయి.