ఐఆర్ఎస్ అధికారిని సస్పెండ్ చేసిన జగన్ సర్కారు

January 18, 2020

ఏపీ సర్వీసులో ఉన్న ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ ను జగన్ సర్కారు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జాస్తి కిషోర్ చంద్రబాబు హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి ఏడీబీగా పనిచేశారు. ఆయనకు చంద్రబాబు తో అధికారిక చనువు ఉండేది. ప్రస్తుతం అవినీతి ఆరోపణలు వచ్చాయన్న కారణం చూపి ఆయనను జగన సర్కారు సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదుకు కూడా ఆదేశించింది. ఆరునెలలు పాటు విచారణకు గరిష్ట గడువు ఇచ్చిన జగన్ అంతవరకు అమరావతి విడిచిపోకూడదని హకుం జారీ చేశారు.

ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా శాఖ నుంచి అందిన నివేదిక ప్రకారం కిషోర్ పై కేసు ప్రభుత్వం ఆదేశాలివ్వడం గమనార్హం. ఈడీబీ సీఈవోగా పనిచేసిన సమయంలో ఆయన ఆధ్వరంలో అనుమతులు మంజూరైన వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపి... అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కారు ఆదేశించింది. ఐఆర్ఎస్ అనేది జాతీయ సర్వీసు. ముఖ్యమంత్రి ఐఆర్ఎస్ ను సస్పెండ్ చేసే అధికారం ఉన్నా కూడా... ఈ స్థాయిలో కేసు నమోదు, విచారణ, అమరావతి విడిచిపోకూడదనే నిబంధన వంటివి పెట్టడం గతంలో అరుదు. అందుకే ఈ వ్యవహారం సంచలనం అయ్యింది. మరి రేపు జాతీయ సర్వీసుల సంఘం దీనిపై స్పందిస్తుందా? లేదా చూడాలి.