షాక్ : శ్రీరెడ్డి మెడలో తాళి... కట్టిందెవరు ?

August 06, 2020

ఎంత ప్రయత్నించినా తనకు బ్రేక్ రాకపోవడం, ఎక్కడికి వెళ్లినా కాస్టింగ్ కౌచ్ తో ఇబ్బందులు వంటి నేపథ్యంలో శ్రీరెడ్డి... ఇండస్ట్రీపై తిరగబడింది. గతంలో ఇండస్ట్రీ పెద్దలకు ఎదురెళ్లి ఎవరూ నిలబడలేదు. కానీ విసుగెత్తి పోయిన శ్రీరెడ్డి అన్నిటికీ తెగించి పోరాటంలో దిగింది. ఆమె పోరాటం కొంత ఫలించింది. అయితే... ఆ పోరాటంలో ఇతరుల కంటే తనే ఎక్కువ లాభపడిందని చెబుతుంటారు. ఆమె వెనుక ఎవరో ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.... యాంకర్ అనసూయ, శ్రీరెడ్డి ఒకప్పుడు సాక్షి టీవీలో సహోద్యోగులు. ఇద్దరికీ పరిచయం ఉంది. మరి అదిపుడు ఎలా ఉందో తెలియదు. అనసూయ అంచలంచెలుగా ఎదిగి కెరీర్ లో సక్సెస్ అయ్యింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయినా తన అందాన్ని కాపాడుకుంటూ అవకాశాలను అందిబుచ్చుకుంటోంది. 

కానీ శ్రీరెడ్డికి అలా కలిసిరాలేదు. బహుశా ఇద్దరికి అందానికి, అభినయానికి తేడాలున్నాయన్నది వేరే విషయం. 

ఇహ సినిమా కెరీర్ ఎలా ఉన్నా... పర్సనల్ గా ఇపుడు శ్రీరెడ్డి బానే సెటిలైందని వార్తలు వస్తున్నాయి. సడెన్ గా శ్రీరెడ్డి మెడలో తాళితో కనిపించింది. దీంతో పెళ్లి చేసుకుందా? శ్రీరెడ్డి భర్త ఎవరు అని అందరూ వెతుకుతున్నారు. వాస్తవం ఏంటంటే... ఆమె కేవలం టిక్ టాక్ కోసం ఆ తాళి తనే కట్టుకుందట. తలపై సింధూరం పెట్టుకుని మెడలో తాళి వేసుకుని టిక్ టాక్ వీడియో చేసుకుందట. అదన్నమాట విషయం... ఆ తాళి ఇతరులు కట్టింది కాదు, తానే కట్టుకున్నది.

 Image