స్టాక్స్ కొనడానికి ఇపుడు రైట్ టైమా కాదా?

August 07, 2020

నెల క్రితం 40 వేల పాయింట్లు ఉన్న నేడు 28 వేలు ఉంది. బహుశా భారత దేశ స్టాక్ చరిత్రలో ఇదే అతిపెద్ద పతనం. గత వారం రోజులుగా మార్కెట్ కొంచెం పుంజుకుంటున్నట్లు కనిపించినా ఈరోజు మళ్లీ ఘోరంగా పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా పెరగడం ఒక కారణం అయితే... ముఖ్యంగా అమెరికాలో దారుణంగా కేసులు పెరగడంతో పాటు భారత్ లోనే కేసుల నెంబరు పెరగడం ఒక కారణంగా చెబుతున్నారు.

ఇదంతా ఓకే... మరి మార్కెట్ బాగా పడింది. కొంటే లాభమే కదా అని చాలామంది ఆతృత పడుతున్నారు. అలాంటి వారికి ఒకటే మాట. 

‘‘షేర్ మార్కెట్లో ఓవర్ నైట్ సంపాదించేయాలని దిగిన వాడు ఎవ్వడూ చరిత్రలో బాగుపడలేదు’’ 

ఇది అక్షర సత్యం. షేర్ మార్కెట్ పై అవగాహన, ఓపిక, సమయానుకూల స్పందన, పరిశీలన ఇవన్నీ ముఖ్యం. ఇక ప్రస్తుత సందర్భాన్ని చూస్తే... ఇపుడు మార్కెట్ బాగా పడిన మాట నిజమే. ఇది కరోనా ప్రభావం మాత్రమే. కానీ అతిత్వరలో కరోనా ముగిసిన వెంటనే కరోనా సృష్టించిన ఆర్థిక మాంద్యం పొంచి ఉంది. దాని దాటికి మరోసారి మార్కెట్ అల్లాడిపోతుంది. అంతవరకు వేచి చూడండి. ఆశపడ్డారో... మునిగిపోతారు.