ఇస్మార్ట్‌ శంకర్ బుకింగ్స్ షాకింగే..

February 19, 2020

‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ కానీ.. ట్రైలర్ కానీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయాయి. విపరీతమైన సౌండ్లతో.. ఓవర్ ద టాప్ డైలాగులతో.. ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రోమోలన్నీ చాలా అతిగా అనిపించాయి జనాలకు. సోషల్ మీడియాలో చాలా వరకు ఈ సినిమా పట్ల నెగెటివిటీనే కనిపించింది. దీంతో రిలీజ్ ముంగిట సినిమాకు ఏమాత్రం బజ్ ఉంటుందో.. బుకింగ్స్ ఎలా ఉంటాయో అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ గురువారం రిలీజవుతున్న ఈ చిత్రానికి రెండు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెస్పాన్స్ షాకింగ్‌గా ఉంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో చాలా వేగంగా టికెట్లు అమ్ముడైపోతున్నాయి. హైదరాబాద్‌లో మెజారిటీ షోలకు అప్పుడే ‘ఫాస్ట్ ఫిల్లింగ్’ ట్యాగ్ లైన్ కనిపిస్తోంది. కొన్ని షోలు అప్పుడే సోల్డ్ ఔట్ అయిపోయాయి.
క్లాస్ ప్రేక్షకులకు రుచించకపోయినా.. మాస్ ఆడియన్స్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రోమోలు బాగానే ఎక్కినట్లున్నాయి. టీజర్, ట్రైలర్లలోనే అగ్రెషన్, బోల్డ్‌నెస్ ఈ తరం యూత్‌ను అట్రాక్ట్ చేసినట్లుంది. మొత్తానికి ‘ఇస్మార్ట్ శంకర్’ టీం ఊహించని స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఓపెనింగ్స్ విషయంలో సినిమాకు ఢోకా లేనట్లే ఉంది. కానీ సినిమాకు టాక్ ఎలా ఉంటుందన్నది కీలకం. ప్రోమోల్లో హడావుడి చేసినా.. రెండున్నర గంటల సినిమాలో కంటెంట్ లేకపోతే సినిమా నిలవడం కష్టం. చిత్ర బృందం చెబుతున్న ప్రకారం అయితే ఈ సినిమా రూ.20 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే తప్ప లాభాల బాట పట్లదు. అదంతా ఈజీ టాస్క్ కాదు. ‘టెంపర్’ తర్వాత హిట్టు లేని పూరికి, ‘నేను శైలజ’ తర్వాత మంచి విజయం లేని రామ్‌కు ఈ సినిమా హిట్టవడం చాలా చాలా అవసరం.