రివ్యూలు దండగన్నాయి... డబ్బులు దండిగా వస్తున్నాయి

February 24, 2020

పూరి జ‌గ‌న్నాథ్ - రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్‌కు ముందు చాలా అనుమానాలే ఉన్నాయి. పూరి ఈ సినిమాతో అయినా హిట్ కొడ‌తాడా ? లేదా ? పూరి ఖాతాలో మ‌రో ప్లాప్ వేసుకోవ‌డ‌మేనా ? అన్న చ‌ర్చ‌లు న‌డిచాయి. గురువారం రిలీజ్ అయిన ఇస్మార్ట్‌కు ప‌ర్వాలేద‌న్న టాక్ వ‌చ్చింది. ఫ‌స్టాఫ్‌లో కాస్త ఎంగేజ్ చేసిన పూరి సెకండాఫ్‌లో త‌న రొటీన్ టేకింగ్‌తో సినిమాను లాగించేశాడు.

క‌థ కొత్త‌గా ఉండ‌డం.. హీరోయిన్ల అందాల ఆర‌బోత‌కు కొద‌వ‌లేక‌పోవ‌డం... ముఖ్యంగా రామ్ న‌ట‌న, స్టైల్ ఈ సినిమాలో కొత్త‌గా ఉండ‌డంతో యూత్‌తో పాటు బీ, సీ వాళ్ల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. అందుకే తొలి రోజు అటు మ‌ల్టీఫ్లెక్స్‌ల‌తో పాటు బీ, సీ సెంట‌ర్ల‌తో అన్ని షోలు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశారు. పూరి, రామ్ సినిమాల‌కు చాలా రోజుల త‌ర్వాత ఇలాంటి బోర్డులు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

ఇక తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 7.83 కోట్లు అంటే దాదాపు రూ.8 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. రూ.18 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ దాటిన వెంట‌నే బ్రేక్ ఈవెన్‌కు రావొచ్చంటున్నారు. సోలోగా రావ‌డం.. పోటీ సినిమాలు లేక‌పోవ‌డంతో ఇస్మార్ట్ లాభాలు వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి.

ఇస్మార్ట్ శంక‌ర్ డే 1 క‌లెక్ష‌న్స్ (రూ.కోట్ల‌లో):

నైజాం - 3.43

సీడెడ్ - 1.20

వైజాగ్ - 0.86

ఈస్ట్ - 0.50

వెస్ట్ - 0.40

కృష్ణ - 0.53

గుంటూరు - 0.57

నెల్లూరు - 0.30
--------------------------------------
ఏపీ + తెలంగాణ = 7.83 కోట్లు
--------------------------------------