అరె హౌలే... ఏం చేస్తున్నావ్ రా బీచ్ లో? !!

February 24, 2020

జగడం... అట్టర్ ఫ్లాప్ అయినా... ఆ సినిమాలో హీరో రామ్ మేనరిజం బాగా హైలైట్ అయ్యింది. అలాంటి మేనరిజానికి కాస్త హైదరాబాదు మసాలా వేసి మంచి చేపలకూర వంటి సినిమా రెడీ చేశాడు పూరీ జగన్నాథ్. హైదరాబాద్ యాసను యాడికాడికి దించేశాడు. అసలే పూరి... ఇలాంటి పొగరెక్కిన మేనరిజాలు సృష్టించడంలో మొనగాడు. అందుకే తాజాగా మరికొద్ది రోజుల్లో విడుదల అవుతున్న ఆ సినిమా ట్రైలర్ వదిలాడు. నిమిషాల్లోనే ఇది వైరల్ అయిపోయింది. మరి ఇస్మార్ట్ శంకర్ థియేటర్లలో అల్లరి సృష్టిస్తాడో లేదో చూడాలె