ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ టాక్ - రామ్ ఇరగదీశాడటగా

February 22, 2020

తెలుగు సినిమాలో పూరి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరుచుకున్నారు. రామ్ గోపాల్ వర్మ కేవలం సినిమాలో ట్రెండ్ ను మార్చాడు. దాన్ని చాలామంది ఫాలో అయ్యారు. కానీ పూరీ స్టైల్ మాత్రం ఎవరూ కాపీ కొట్టలేనిది. ‘‘అన్నా వీడేందన్నా పూరీ సినిమాలో హీరో లాగా తిక్కతిక్కగా ఉన్నాడు‘‘ అని తెలుగు సినిమాలోనే ఒక డైలాగ్ పెట్టారంటే... హీరోలను తీర్చిదిద్దడంలో పూరీని కొట్టేవాళ్లే లేరు. 

హీరోకి ఒక రకమైన లెక్కలేనది, గేర, మితిమీరిన ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. అంటే... ఇది తొక్కలో ప్రపంచం నాలాంటోడు దిగనంతవరకే అని 18-25 ఏళ్ల మధ్య పిల్లలు ప్రతివిషయంలో హై డోస్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. పూరీ హీరోలు కూడా అంతే. వాళ్లకు నచ్చింది చేస్తారు, అందుకే యూత్ లో పూరి సినిమాలకు బాగా క్రేజ్. అలాంటి పూరీకి ’రామ్‘ వంటి ఎనర్జటిక్ హీరో దొరికితే ఊరికే ఉంటాడా? ఇరగదీస్తాడు. 

అవును ’ఇస్మార్ట్ శంకర్’ గా రామ్ ఇరగదీశాడు... అసలు పొద్దున నుంచి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చెరిగిపోని క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటారు. సింపుల్ గా చెప్పాలంటే... రామ్ బాడీలో పూరీ ప్రవేశించి రామ్ ఎనర్జీని వాడుకుంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉందిక్కడ. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ కు వందకు వంద మార్కులు పడుతున్నాయి. ఆల్ దిబెస్ట్ పూరి, రామ్ !