అసలు ఐటీ శాఖ ప్రెస్ నోట్లో ఏముంది?

August 05, 2020

ఐటీ శాఖ దాడులు నిర్వహించటం మామూలే. అందుకు భిన్నంగా తాజాగా విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంచలనంగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా ఆదాయపన్ను శాఖ జరిపిన దాడుల్లో రూ.2వేల కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించినట్లుగా పేర్కొంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అది కూడా గడిచిన మూడు నాలుగు రోజుల్లోనే కావటం చూస్తే.. టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు కొత్త కష్టం వచ్చినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది.
సంచలనంగా మారిన ఐటీ శాఖ తాజా ప్రెస్ నోట్ లో పేర్కొన్న అంశాల్ని చూస్తే..
%  2020 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణెల్లో సోదాలు జరిపింది.
% రెండు తెలుగు  రాష్ట్రాల్లో కలిపి మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి.
%  ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి.
%  అధిక బిల్లులు, బోగస్ బిల్లులతో బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిపిన రాకెట్ గుట్టు రట్టయింది.
%  ఓ ప్రముఖుడి (చంద్రబాబు?)కి వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన వ్యక్తి మీద కూడా ఐటీ దాడులు జరిగాయి.
%  ఆ వ్యక్తికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభించాయి. సదరు ఇన్ ఫ్రా కంపెనీలు కొన్ని పనులు ఇతర కంపెనీలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్లు చూపాయి.
%  అయితే.. ఆ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు లేవు. అవన్నీ బోగస్ సంస్థలుగా రిపోర్టులో తేలింది.
%  మాకు లభించిన ప్రాథమిక ఆధారాల్ని పరిశీలిస్తే.. సుమారురూ.2వేల కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించాం.
%  వేసిన బిల్లుల్నే మళ్లీ వేస్తూ.. రూ.2కోట్ల కంటే తక్కువ పనులుగా చూపిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ పుస్తకాల్లోని ఎంట్రీల్లో ఉన్న కంపెనీల్ని పరిశలిస్తే.. అసలు అలాంటివేమీ లేవని తేలింది. కంపెనీ చిరునామాల్ని వెతికినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. ఇవన్నీ డొల్ల కంపెనీలుగా తేలాయి.