ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

May 31, 2020

పలు హిట్ చిత్రాల్ని నిర్మించిన నిర్మాత కేఎల్ నారాయణ. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద ఆయన నిర్మించిన పలు చిత్రాలు హిట్ అయ్యాయి. క్షణక్షణం.. దొంగాట.. రాఖీ.. సంతోషం.. హలోబ్రదర్.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రాల్ని తీసిన సదరు నిర్మాత.. ఇప్పుడు ఐటీ సోదాల్ని ఎదుర్కొంటున్నారు.
ఆయనకు చెందిన ఆఫీసుల్లో.. ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్.. విజయవాడలోని ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అధికారులు తాజాగా ఆయన స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు.
ఇంట్లోని రెండు బీరువాల్ని తెరవాల్సి ఉందని చెబుతున్నారు. అయితే.. నారాయణ లేనందున.. ఆయన వచ్చే వరకూ వాటిని తెరవకూడదని ఉండిపోయారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన నారాయణ.. ఇంటికి చేరుకున్నతర్వాత రెండు బీరువాల్ని తెరుస్తారని చెబుతున్నారు. ఐటీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో తాజా సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

Read Also

కేటీఆర్‌..త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తి
రేవంత్ వ‌ర్సెస్ కోమ‌టిరెడ్డి
సూపర్ ట్విస్ట్... మహా పీఠంపై సర్ ప్రైజ్ సీఎం