విజయశాంతి రీఎంట్రీ ఫస్ట్ లుక్ !!

February 22, 2020

అత్యధిక కథానాయిక బేస్డ్ పాత్రలు చేసిన నటి. ఆమె ఉంటే సినిమాకు కలెక్షన్ల వరద. ప్రాంతీయ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన ఘనత.. ఆమె విజయశాంతి. 13 సంవత్సరాల అనంతరం మళ్లీ కెమెరా ముందుకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాస్త బ్లర్ గా ఆమె ఫస్ట్ లుక్ ను షేర్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా విజయశాంతి గురించి అద్భుతమైన కామెంట్ చేశారు అనిల్.

‘‘పదమూడేళ్లు గడిచాయి... ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే వ్యకిత్వం, అదే డైనమిజం... మా టీంలోకి సుస్వాగతం విజయశాంతి గారు’’ అంటూ అనిల్ చేసిన వ్యాఖ్యలు విజయశాంతి గురించి మూడు ముక్కల్లో చెప్పేశాయి.