పెళ్లయిన వాడి చేతిలో మోసపోయిన యంగ్ హీరోయిన్

February 23, 2020

ఒక వివాహితుడిని ప్రేమించి మోసపోయినట్టు హీరోయిన్ ఆండ్రియా సంచలన నిజం వెల్లడించింది. ఆ వేధింపులు ఆమెను ఏకంగా డిప్రెషన్లోకి నెట్టాయట. దాన్నుంచి బయటపడటానికి ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నట్టు ఆండ్రియా చెప్పడం విశేషం. కొంతకాలం క్రితం విశ్వరూపం2, వడ చెన్నై సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో ఆమెకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఆమె కనిపించలేదు. దానికి కారణం... ఈ వైద్యమే. అయితే, ఆ సమయంలోనే ఆమె ‘బ్రోకెన్ వింగ్’ అనే పుస్తకం కూడా రాసింది. అందులోనే తన ప్రేమ బాధల గురించి చెప్పుకువచ్చింది.

తనను అంత వేధించిన వ్యక్తి పేరు ఆమె బయటపెట్టలేదు అంటే అతను కచ్చితంగా దర్శకుడు లేదా నిర్మాత అయిఉండాలి అని పలువురు అంటున్నారు. అందుకే  లైఫ్ ని మరింత కాంప్లికేట్ చేసుకోవడం ఇష్టం లేకనే ఆమె పేరు వెల్లడించలేదు. తన బాధను పుస్తకంగా మలిచి రాసిన బ్రోకెన్ వింగ్ కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో ఆమె ఆ పుస్తకం కోసం ఏకంగా ఓ ఇన్ స్టా గ్రేమ్ పేజ్ ఓపెన్ చేసింది. ఆ పేజీ అడ్రెస్ - https://www.instagram.com/andreajeremiah.brokenwing 

ఆండ్రియా సింగర్ గానే కాకుండా నటిగా కూడా రాణించింది. త్వరలో ఆమె నటించిన మరో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వట్టం, కా, మాలింగై అనే టైటిల్స్ తో ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.