ఆ రెండు దేశాలు ఏడవడం తప్ప ఏం చేయలేకపోతున్నాయి

May 31, 2020
CTYPE html>
కరోనా మారణహోమం రోజురోజుకు పెరుగుతోంది. మరణాల్లో ఇటీవలి వరకు మొదటి స్థానంలో ఉన్న చైనాను గత వారంలో ఇటలీ దాటేసింది. తాజాగా స్పెయిన్ కూడా చైనా మరణాల సంఖ్యను దాటేసింది. డబ్బున్న దేశాలే అయినా... వెంటనే హాస్పిటల్స్ కట్టగలరు గానీ వెంటనే వైద్యులను తయారుచేయలేరు కదా. అందుకే ఎంత డబ్బున్నా, శక్తి ఉన్నా మరణాలను ఆపలేకపోతున్నారు. 
దీనికి ప్రభుత్వాలను మాత్రం నిందిస్తే సరిపోదు. ప్రజల తప్పు కూడా అంతే ఉంది. కరోనా అనుమానిత పౌరులు ఇతరులను కలవడం వల్ల నాలుగో దశలోకి జారిపోయాయి ఈ రెండు దేశాలు. దురదృష్టం ఏంటంటే... అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా పరిస్థితి కూాడా అలాగే అయిపోయింది. నిన్న ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి అంటే  పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. అమెరికాకు ఏకకాలంలో కేవలం 70 వేల క్రిటికల్ కేసులను మాత్రమే కాపాడగలిగిన శక్తి ఉండటం అందరినీ విస్మయానికి గురిచేసింది. పెదన్నగా చెప్పుకునే అమెరికా అలా ఉన్నపుడు ఇక ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు ఏం చేయగలవు? 
ప్రపంచ వ్యాప్తంగా 16 వేల మంది చనిపోగా... పదివేలు ఈ రెండు దేశాల మరణాలే. ఇటలీలో మరణాలు 6 వేలు దాటిపోగా, స్పెయిన్ లో 3434 మంది చనిపోయారు. చైనాలో 3285 మంది చనిపోయారు. అంటే మూడు దేశాల్లోనే 75 శాతం మరణాలున్నాయి. మిగతా మరణాలు ఇతర దేశాలవి. వీటితో పోలిస్తే మన వద్ద మరణాలు 12 మాత్రమే ఉన్నా... మహారాష్ట్ర, రాజస్థాన్ లలో పరిస్థితులు చేయిదాటి పోయాయని అంటున్నారు. 
ఒకదేశం ఇంకో దేశానికి సాయం చేసే పరిస్థితి కూడా లేదు. అందరికీ కరోనా కష్టాలే. చివరకు బ్రిటన్ రాజుకే కరోనా వచ్చిందంటే... ఇక ఎవరు మాత్రం ఏం చేయగలరు.