ఆ అమ్మాయి ప్రేమ ప్రపంచాన్ని గెలిచింది

June 05, 2020

భారతదేశపు బలం డబ్బు కాదు

భారతదేశపు బలం ఎగుమతులు కాదు

భారతదశపు బలం టెక్నాలజీ కూడా కాదు...

భారతీయుల బలం కుటుంబం. ఒకరి కష్టంలో ఒకరు పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకునే అద్భుతమైన వ్యవస్థ కుటుంబం. ఎన్ని ఆర్థిక మాంద్యాలు వచ్చినా, ఎన్ని క్రైసిస్ లు వచ్చినా కుటుంబ బలం వల్లే ఈ దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోంది. 

బీహార్ కు చెందిన ఒక వ్యక్తి, అతని కూతురు పదిహేనేళ్ల జ్యోతికుమారి  ఢిల్లీలో నివసించేవారు. రిక్షా తొక్కుతూ రెక్కల కష్టంతో తనను పెంచి పెద్దచేసిన తండ్రికి అనారోగ్యం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో లాక్ డౌన్ పెట్టారు. ఇంటికి వెళ్లాలి. వేరే మార్గం లేదు. తండ్రి నడవలేడు. 

కానీ తన తండ్రిని తీసుకుని ఎలాగైనా ఊరు చేరాలనుకున్న ఆమె సంకల్పం అన్నిటినీ అధిగమించేలా చేసింది. ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కుని 1200 కిలోమీటర్లు 7 రోజుల పాటు ప్రయాణించి గమ్యం చేరింది. ఆమె గెలిచింది తన తండ్రి ప్రేమను మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తం ప్రేమను గెలిచింది ఆ చిన్నారు. ఆమె అనురాగానికి, తెగువకు ఫిదా కాని వారెవరు లేరు. 

ఆమె తన కర్తవ్యం ఆలోచించకుండా నాకు కష్టం ఉంది ఎవరైనా సాయం చేయండి... మమ్మల్ని ఇంటికి చేర్చండి అని వేడుకుని ఉంటే పంపించేవారేమో. కానీ ఆమె ఎన్నటికీ విజేత అయ్యేది కాదు. తను ఎవరినీ యాచిస్తూ కూర్చోలేదు. తాను నమ్మింది, తనకు చేతనైనది చేసింది. ఆమె గెలిచింది. ప్రతి ఒక్కరిని గెలిచింది. 15 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి ఇంత సాహసం ఎలా చేసిందో అర్థం కావడం లేదు ఎవ్వరికీ. ఆమెను ప్రశంసించని వారు లేరు. 

ఈ విషయం మీడియా ద్వారా ట్రంప్ కుమార్తె ఇవాంకాకు తెలిసింది. జ్యోతి తెగువకు, ప్రేమకు ఇవాంకా ముగ్దురాలైపోయింది. ఇవాంకా ఆమె గురించి ఇలా ట్వీట్ చేసింది. 

15 yr old Jyoti Kumari, carried her wounded father to their home village on the back of her bicycle covering +1,200 km over 7 days. This beautiful feat of endurance & love has captured the imagination of the Indian people and the cycling federation! (15  సంవత్సరాల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని వెనుక సీట్లో కూర్చోబెట్టుకుని ఏడు రోజుల్లో 1200 కిలోమీటర్లు ప్రయాణించి ఇల్లు చేరడం... భారతీయుల్లోని అసమానమైన ఓర్పుకు, ప్రేమకు ఇది నిదర్శనం. ఆమె చూపిన ఈ అద్భుతం భారతీయులనే కాదు, సైక్లింగ్ పెడరేషన్ ను కూడా ఆకర్షించింది) 

జ్యోతికుమారి కేవలం ఒక సాధారణ యువతి కాదు. ఈ దేశం ఆత్మ ఎక్కడుందో ప్రపంచానికి చెప్పిన యువత. మనం కష్టాలను స్వయంకృషితే అధిగమిస్తే ఎలాంటి గుర్తింపు వస్తుందో నిరూపించి చూపించిన గొప్ప ఐకాన్.