సాల్లేబ్బా నీ సంబడం... ఐవైఆర్

July 03, 2020
CTYPE html>
ఐఏఎస్....ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్....దేశంలో ఐఏఎస్ అధికారుల‌కు ప్ర‌జాప్ర‌తినిధులు సైతం ఎంతో గౌర‌వ‌మిస్తారు. పేరుకు ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టికీ....అనేక ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లులో ఈ బ్యూరోక్రాట్ల పాత్ర ఎంతో కీల‌కం. ఒక జిల్లా రూపు రేఖ‌లు మార‌డంలో క‌లెక్ట‌ర్ల పాత్ర మ‌రువ‌లేనిది. త‌మ కార్య‌ద‌క్ష‌త‌తో ఎంద‌రో ఐఏఎస్‌లు ఆ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చారు. అయితే, అదే స‌మ‌యంలో త‌మ చౌక‌బారు వ్యాఖ్య‌ల‌తో అదే ప‌ద‌వికి కొంద‌రు ఐఏఎస్‌లు మాయ‌ని మ‌చ్చ‌గా మారారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల్సిన ఈ మాజీ సీఎస్....ఫుల్ టైం రాజ‌కీయ నేత‌ల‌ను త‌ల‌ద‌న్నేలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఊస‌ర‌వెల్లి త‌ర‌హాలో పార్టీల‌కు వంత‌పాడే ఈ తెలుగు ఐపీఎస్ మ‌రెవ‌రో కాదు....ఏపీ మాజీ సీఎస్, ప్ర‌స్తుత బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు.

ఐవైఆర్ కృష్ణారావు....చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ సీఎస్‌గా ప‌నిచేసిన ఈ పెద్ద‌మ‌నిషి....ఆ త‌ర్వాతి కాలంలో చంద్ర‌బాబుపై, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్రబాబు నచ్చకపోతే ఆయన్ను విమర్శించుకోవచ్చు. అందులో సామాన్యులకు ఏ అభ్యంతరం లేదు. కానీ ఏ ఎండకా గొడుగు ప‌ట్ట‌డం నేర్చుకున్న ఈ మాజీ ఐఏఎస్‌....ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రజలను, ప్రజాభిప్రాయాన్ని అవమానించేలా కారు కూత‌లు కూయడం మొదలుపెట్టారు. ఐవైఆర్‌...తాజాగా చేసిన ట్వీట్ ఆయ‌న పైత్యానికి ప‌రాకాష్ట అని చెప్ప‌వ‌చ్చు. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం త‌మ భూములు త్యాగం చేసిన రైతుల‌ను కించ‌ప‌రిచేలా ఐవైఆర్ చేసిన కామెంట్స్ వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఓ ప‌క్క రాజ‌ధాని రైతుల ఉద్య‌మంపై జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతుంటే....ఆంధ్రుడైన ఐవైఆర్ ఆ ఉద్య‌మానికి ప్ర‌జాస్పంద‌న క‌రుదైందంటూ చౌక‌బావు వ్యాఖ్య‌లు చేశారు.

ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైన వారంలోనే దావానంలా రాష్ట్రం అంతటా వ్యాపించింద‌న్న ఐవైఆర్‌.... రాజ‌ధాని త‌రలింపు ఉద్యమానికి మీడియాలో ఒక భాగం, టీడీపీ జాకీలు పెట్టి లేపినా ప్రజా స్పందన కరువైందంటూ చేసిన వ్యాఖ్య‌లపై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాదు, బిజెపి జనసేన కూటమి ఈ విషయాన్ని గ్రహించి తమ ఎదుగుదలకు ఇంకేదైనా అజెండా ఎంచుకుని ముందుకు పోతే మంచిదంటూ ఓ ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చారీ మాజీ ఐఏఎస్. ఈ మాజీ సీఎస్ వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సాల్లేబ్బా నీ సంబడం... ఐవైఆర్ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ప‌నిచేసిన ఒక ఐఏఎస్ అధికారి...ఇంత స్వార్థంగా, దారుణంగా మాట్లాడడం ఒక్క ఐవైఆర్‌కే చెల్లింది. అమ‌రావ‌తి రైతుల ప‌క్షాన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నిల్చున్నాయి. అటువంటి పార్టీల‌ను ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు. దీనిని బ‌ట్టి ప్రజాసమస్యల‌ పరిష్కారాని రాజ‌కీయ పార్టీలు  పోరాడాల్సిన అవసరం లేద‌ని ఐవైఆర్ అభిప్రాయ‌ప‌డుతున్నారు కాబోలు. అంటే, రాజ‌కీయ పార్టీలు త‌మ మ‌నుగ‌డ కోసం....త‌మ పార్టీ ఎదుగుద‌ల‌కు దోహ‌ద‌ప‌డే అంశాల మీదే పోరాడ‌ల‌న్న‌ది ఐవైఆర్ ఉద్దేశం కాబోలు. దీనిని బ‌ట్టి ఐవైఆర్ దృష్టిలో ప్రజలు...ప్ర‌జా సంక్షేమం...పథ‌కాలు... అంతా డ్రామా అన్న‌మాట‌. ప్ర‌జా సంక్షేమం కోసా పాటుప‌డ‌మ‌ని పార్టీల‌కు స‌ల‌హా ఇవ్వ‌వ‌ల‌సిన పెద్ద‌మ‌నిషి....పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని సిగ్గులేని సలహా ఇవ్వ‌డం శోచ‌నీయం. స్వార్థ‌ప‌రులైన పొలిటిషియ‌న్స్ కంటే...ఇటువంటి డ‌ర్డీ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీస్ ఉన్న ఇటువంటి ఐఏఎస్‌లే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు.

Read Also

స్వామి సొమ్ము.. స్వాములోరికి!?
కేంద్రం చేతులెత్తేసినా జగన్ పదేపదే 'ప్రత్యేక' మంత్రం.. ఎందుకు?
​మోడీకి కేబినెట్లోకి వైసీపీ... ఈ గాసి​ప్ లో నిజమెంత?