జబర్దస్త్ బ్యాక్... బాలయ్య డైలాగ్ రీమేక్ పేలింది

August 08, 2020

సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు వారి ఫేవరెట్ షో తిరిగి మొదలైంది. ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడంతో సీజన్ 2 తొలి ఎపిసోడ్ ఈ గురువారం ప్రసారం కానుంది. 

తాజాగా ఈరోజు ప్రోమో విడుదల చేశారు. ప్రోమో చూశాక ఒక విషయంపై క్లారిటీ వచ్చింది. విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న టీం మరింత కామెడీని రంగరించే క్వాలిటీ ట్విస్టులతో అదరగొట్టేస్తున్నారు. 

అందరూ ఊహించినట్లే కోవిడ్ ను కూడా స్కిట్స్ లో భాగం చేసుకుని పంచల్ లు వేస్తున్నారు. ఈ ప్రోమోలో హైలెట్  ఏంటంటే... తాజాగా విడుదలైన నందమూరి బాలకృష్ణ టీజరు డైలాగును ఆది తనదైన శైలిలో రీమేక్ చేసి రైజింగ్ రాజు వేయడం బాగా పేలింది.

ఈ 6 నిమిషాల ప్రోమోను ఎంజాయ్ చేయండి మరి.