బ్రోతల్ కేసులో జబర్దస్త్ కమెడియన్లు అరెస్టు

August 07, 2020

జబర్ధస్త్ షో....గత కొన్నేళ్లుగా బుల్లితెరలో ఇంత పాపులర్ అయిన కామెడీ షో మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ షో లో యాంకర్ల స్కిన్ షో కొద్దిగా ఎక్కువైందని....కొంచెం మసాలా పాళ్లు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వస్తున్పప్పటికీ....దీనికున్న క్రేజ్ తగ్గడం లేదు. ఇక, ఆ స్కిట్ లలో డబుల్ మీనింగ్ డైలాగ్ ల సంగతి చెప్పక్కరలేదు.

జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ లలో అయితే...ఈ తరహా డైలాగ్ ల మోతాదు కొంచెం ఎక్కువే ఉంటుందని టాక్. ఇక, ఆది స్కిట్ లలో నటించే దొరబాబు....ఆ తరహా వీడియోల్లో నటిస్తాడంటూ...ఆది పంచ్ లు వేస్తుంటాడు. అయితే, తాజాగా విశాఖలోని ఓ వ్యభిచార గృహంపై జరిపిన రైడ్ లో దొరబాబు దొరికిపోయారని తెలుస్తోంది. దీంతో, ఆది పంచ్ లు నిజమయ్యాయని టాక్ వస్తోంది.
విశాఖలోని మాధవధారలోని ఓ అపార్ట్ మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ వచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేశారు.   పోలీసులు జరిపిన దాడిలో జబర్ధస్త్ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశిలు దొరికిపోయారు. ఈ దాడిలో ఒక మహిళ, మరో ఇద్దరు విటులతో పాటు ఈ ఇధ్దరు పట్టుబడ్డారని తెలుస్తోంది. షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశిలతో సహా ఇద్దరు నిర్వాహకులు, మరో ఇద్దరు విటులు పట్టుబడ్డారని, ప్రస్తుతం వీరంతా టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.