అబద్దాల అంబటి... అడ్డంగా దొరికిన వేళ

July 05, 2020

తెలుగుదేశం పార్టీని ఇరికించడానికి వైసీపీ నాలుగు ప్రయత్నాలు చేస్తే... మూడింట్లో తనకే ఎదురుదెబ్బ తగులుతోంది. ఇప్పటికే పోలవరం, సీబీఐ, పీపీఏ వంటి విషయాల్లో పెద్ద దెబ్బలు తగిలాయి వైసీపీకి. తాజాగా అమెరికాలో జ్యోతి ప్రజ్వలన విషయంలో జగన్ నిరాకరణపై బీజేపీ చాలా సీరియస్ అయ్యింది. తీవ్రంగా విమర్శలు చేసింది. దీనిపై బీజేపీ ఏమీ అనలేక తీవ్ర మదనం అనుభవించారు వైసీీపీ నేతలు. ఉరుమి ఉరుమి మంగళం మీద పడినట్లు... తెలుగుదేశం మీద పడ్డారు. దీంతో తెలుగుదేశం సాక్ష్యాలతో కూడిన గట్టి కౌంటర్ ఇచ్చి వైసీపీ నోరు మూయించింది.
ఇటీవలే అంబటి రాంబాబు ఈ విషయంపై మాట్లాడుతూ అమెరికాలో జ్యోతి వెలిగించడం ఏంటి, అది అక్కడ తీవ్రమైన నేరం. అక్కడి చట్టాల ప్రకారం జ్యోతి వెలిగించడం ఉండదు అంటూ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ గతంలో అమెరికాలో ఎన్నారైల సమావేశంలో చంద్రబాబు జ్యోతి వెలిగించిన వీడియోను బయటపెట్టింది. ఈ సందర్భంగా టీడీపీ చేసిన కామెంట్ ఇది.
సాంప్రదాయం ఇష్టం లేకపోతే చెప్పండి..
ఇలా అబద్దాలు చెప్పడం ఎందుకు అంబటి గారూ.. ?  

video link : https://twitter.com/i/status/1164939706934521856

అంటే అంబటి చెప్పింది అబద్ధం. అమెరికాలో కూడా యథేచ్చగా జ్యోతి ప్రజ్వలన చేయొచ్చు అని టీడీపీ సాక్ష్యాధారాలతో చూపించింది. ఇంకో విషయం ఏంటంటే... అమెరికా అధ్యక్షుడు క్రిస్టియన్ అయిన ట్రంప్ కూడా జ్యోతి ప్రజ్వలన చేయడానికి వెనుకాడలేదు గాని... రెండు తరాల కింద క్రిస్టియన్ లోకి వెళ్లిన జగన్ మాత్రం జ్యోతిప్రజ్వలనకు నిరారకరించినట్లు బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. గతంలో భారతీయుల సమావేశానికి హాజరైన ట్రంప్ చక్కగా జ్యోతి వెలిగించారు (ఫొటో పైన చూడొచ్చు).