జగన్ వదిలిన మరో కులాస్త్రం

April 05, 2020

ఏపీలో కులాన్ని పకడ్బందీగా వాడుకోవడంలో జగన్ మాస్టర్స్ డిగ్రీ చేశాడు. అయితే.. ఆ క్రమంలో తనపై కులముద్ర పడకుండా ప్రతిపక్షాన్ని కులాన్ని అంటగట్టి తాను మాత్రం అన్ని కులప్రాతిపదికనే రాజకీయం నిర్మించుకుంటూ వెళ్తున్నారు ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి. ముందుగా తన సొంత కులం అయినా రెడ్డి వర్గాన్ని పూర్తిగా తన వశం చేసుకుని ఆ తర్వాత క్రిస్టియానిటీతో ఆంధ్రలోని అత్యధిక పేదలను, ఎస్సీలను వాడుకున్నారు. కాపులను తిట్టి బీసీలను బాబుకు దూరం చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాపు లీడర్లను కొనేసి కాపులను పరోక్షంగా తనవైపు తిప్పుకున్నారు. అంటే ఆ సామాజిక వర్గాన్ని వాడుకోవడం కంటే చీల్చడం ద్వారా ఎక్కువ ఉపయోగించుకున్నారు. 

ఇక తాజాగా తన క్రిస్టియానిటీ ముద్రను తగ్గించుకోవడానికి రాజ్యాంగ ప్రాథమిక లక్షణానికి విరుద్ధంగా... కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టారు. లౌకిక రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగానికి హజ్ యాత్ర ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ తూట్లు పొడిచింది. ఇపుడు ఆ క్రమంలో జగన్ రెడ్డి కుల చీలిక కోసం బ్రాహ్మణులకు ఉపనయనం కోసం పదిహేను వేలు ఇస్తారట. పేదలకు సాయం చేయడం తప్పులేదు. కానీ దానిని కులాల పేరు చెప్పి చేయడమే మహా తప్పిదం. ఉపనయనం అనేది ఒక కులాచారం, మత సంప్రదాయం. దానికి ప్రజల డబ్బులు దానం చేయడం ఇతరులను వంచించడమే. మరోవైపు పేద బ్రహ్మణులకు విదేశీ విద్య కు సాయం చేశారు. ఇది మంచి పనే. బ్రాహ్మణులు ఆస్తుల సమీకరణలో కొంచెం వెనుకపడటంతో ఆర్థికంగా బలంగా లేరు. అలాంటి వారి చదువుకు సాయం చేయడం తప్పులేదు గానీ ఉపనయనం అనే ప్రక్రియకు సాయం చేయడం కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని అవమానించడమే. 

అయితే, తన ప్రత్యర్థి అయిన కమ్మవర్గాన్ని టార్గెట్ చేయడానికి బ్రాహ్మణులను దగ్గర తీయడం అనే వ్యూహంలో జగన్ ఈ పథకం ప్రవేశపెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే ఆలయాలను కూల్చేయించిన జగన్ సడెన్ గా బ్రాహ్మణులపై ఇంత ప్రేమ కురిపించడం వెనుక బాబు వర్గంపై కోపమే గాని వీరిపై ప్రేమ కాదని స్పష్టమవుతోంది.