వామ్మో- జగన్ చేసిన పని తెలిస్తే షాకవుతారు

June 26, 2020

ఏపీలో లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ అయితే ముగిసింది గానీ... ఫలితం మాత్రం ఇంకా రాలేద‌నే చెప్పాలి. ఫ‌లితాలు రావ‌డానికి ఇంకా నెల స‌మ‌యం ఉంది. వ‌చ్చే నెల 23న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఆ ఫ‌లితాల్లో తాము గెలుస్తామంటూ ఇటు అధికార టీడీపీతో పాటు అటు విప‌క్ష వైసీపీ కూడా ధీమాగానే చెబుతున్నాయి. పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించిన రెండు పార్టీలు ధీమాతోనే ఉన్నాయి. అయితే ఈ ధీమాలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రింత ఎక్కువ ధీమాను వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే తాను సీఎం అయిపోయిన‌ట్గుగా ప్ర‌క‌టించుకున్న జ‌గ‌న్‌... పోలింగ్ ముగిసిన వెంట‌నే తాము గెలిచిపోయిన‌ట్లుగా కూడా చెప్పేశారు. అస‌లు మే 23నాటి ఫ‌లితాల్లో వైసీపీకి ఎంత మేర అవ‌కాశాలున్నాయో, టీడీపీకీ అంతే మేర అవ‌కాశాలూ లేక‌పోలేదు. అయితే గెలుపుపై కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే గానీ... ఆ కాన్ఫిడెన్స్ శృతి మించితేనే ఇబ్బంది. ఇలాంటి ప‌రిస్థితే జ‌గ‌న్ లో చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే సైలెంట్ అయిపోయిన జ‌గ‌న్ ఏం చేస్తున్నార‌న్న విష‌యానికి వ‌స్తే... మే 23న ఎలాగూ వైసీపీ గెలుస్తుంది కాబ‌ట్టి... సీఎంగా తాను ఎప్పుడు ప్ర‌మాణ స్వీకారం చేయాల‌న్న విష‌యంపై అప్పుడు జ్యోతిష్యుల‌తో మంత‌నాలు మొద‌లెట్టేశార‌ట‌. తాను న‌మ్మే పండితుల‌ను ఇప్ప‌టికే త‌న ఇంటికి పిలిపించుకున్న జ‌గ‌న్ తాను సీఎంగా ఎప్పుడు ప్ర‌మాణం చేస్తే బాగుంటుందో చూడాల‌ని కోరార‌ట‌.

ఈ క్ర‌మంలో లెక్క‌లేసిన జ్యోతిష్యులు... మే 25న దివ్వ‌మైన ముహూర్తం ఉంద‌ని చెప్పేశార‌ట‌. దీంతో అదే తేదీని ఖ‌రారు చేసుకున్న జ‌గ‌న్‌... ప్ర‌మాణ స్వీకారం సంధ‌ర్భంగా తన నోట నుంచి రావాల్సిన‌ *జ‌గ‌న్ అనే నేను...* పాఠాన్ని ప్రాక్టీస్ చేయ‌డం మొద‌లెట్టేశార‌ట‌. అంతేకాదండోయ్‌... త‌న‌ను ఎంత‌టి పెద్దొళ్లైనా సార్ అనే పిల‌వాలంటూ మొన్న‌టిదాకా త‌న‌దైన నైజాన్ని చాటుకున్న జ‌గ‌న్ ఇప్పుడు కొత్త పేరుతో పిల‌వాల‌ని ఆదేశాలు జారీ చేశార‌ట‌. అదేంటంటే... ఇక‌పై త‌న‌ను సార్ అని పిల‌వొద్ద‌ని, ఎలాగూ సీఎం అయిపోతున్నాను కాబ‌ట్టి... ఇప్ప‌టి నుంచే త‌న‌ను సీఎం సార్ అని పిలవాలంటూ హుకుం జారీ చేశార‌ట‌. ఈ మేర‌కు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఈ వార్త‌లు జోరుగా స‌ర్క్యులేట్ అవుతున్నాయి.