జగన్ ... నీ యుటర్న్ కు ఇదే లిఖితపూర్వక సాక్ష్యం

July 10, 2020

‘‘తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లను ప్రతిఘటించలేని, ప్రశ్నించలేని చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష మూడవ రోజుకు చేరుకుంది. జననేత చేపట్టిన నిరాహార దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా మద్దతు లభిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్ జగన్ కు సంఘీభావం తెలుపుతున్నారు. అదేవిధంగా పార్టీశ్రేణులు వైయస్ జగన్ జలదీక్షకు మద్దతుగా రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. ఏపీకి జరుగుతున్న జల అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైయస్ జగన్‌ తన పోరాటం కొనసాగిస్తున్నారు.’’

ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు కర్నూలు కేంద్రంగా 2016 మేలో చేపట్టిన జలదీక్షపై ఆయన పార్టీ వెబ్ సైట్లో రాసిన వార్త. (లింకు - https://www.ysrcongress.com/others/ys-jagan-jaladeeksha3-day-16900 ) దీనిని బట్టి జగన్ ఎన్ని యుటర్నులు తీసుకున్నారో, ఎన్ని అబద్ధపు పోరాటాలు చేశారో జనానికి స్పష్టంగా అర్థమవుతుంది.

ఆరోజు కేసీఆర్ రాష్ట్రాన్ని నిలువునా ముంచుతున్నారు అంటూ పోరాటాలు చేసి, ఎప్పటికపుడు ఏపీ జల ప్రయోజనాలు కాపాడుతున్న చంద్రబాబుపై నిందలేసిన ఈ పెద్ద మనిషి తన పార్టీ వెబ్ సైట్లో, తన సొంత పత్రికలో ఎవరిపైన అయితే వ్యతిరేకంగా రాశారో, దేనిపైన అయితే ధర్నా చేశారో, ఏ విషయాన్ని అయితే వ్యతిరేకించారో... దాని ప్రారంభోత్సవానికి పోలోమంటూ పోతున్నారు. ఇది ఆంధ్రులు ప్రతిఘటించాల్సిన విషయం. జగన్ సమాధానం చెప్పాల్సిన అంశం. 

ఇంతకీ జగన్ ఆ దీక్ష ఎందుకు చేశారంటే... 2016 మే 2వ తేదీన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనిని నిరసిస్తూ, కేసీఆర్కు చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ నిరసన దీక్ష చేస్తానని ప్రకటించారు. కర్నూలులో మే 1618వరకు దీక్ష చేశారు. సిగ్గు లేకుండా ఆ రోజు కట్టొద్దని నిరసన దీక్ష చేసిన ప్రాజెక్టుకు ప్రమాణ స్వీకారానికి వెళ్లడం ఏపీకి జగన్ చేస్తున్న ద్రోహం కాదా ?? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. 

ఈ వార్త చూసి లింకు తొలగిస్తారేమో అనే ఉద్దేశంతో ఆ స్క్రీన్ షాట్ కూడా ఇస్తున్నాం.