జ‌గ‌న్ ఇంట్లో విషాదం !

May 30, 2020

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఇంట్లో విషాదం నెల‌కొంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి త‌మ్ముడు, జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఈ తెల్ల‌వారుజామున గుండెపోటుతో మ‌ర‌ణించారు. మాజీ మంత్రిగా ప‌నిచేసిన‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి ప్ర‌స్తుత వ‌య‌సు 68 సంవ‌త్స‌రాలు. ఆయ‌న హఠాన్మ‌ర‌ణం జ‌గ‌న్ కుటుంబంలో విషాదం నింప‌గా, వైసీపీ శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గురిచేసింది. రేపు అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేయాల్సిన నేప‌థ్యంలో ఆ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డుతుందా? అని అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు.
వివేకాకు భార్య సౌభాగ్య‌.. కుమార్తె ఉన్నారు. ముక్కుసూటి మ‌నిషి. కానీ సౌమ్యుడిగా పేరుంది. రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు శ‌త్రువులు త‌క్కువ‌. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి కుడిభుజంగా వ్య‌వ‌హ‌రించేవారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ పులివెందుల‌లోని త‌న నివాసంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గ‌తంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప‌ని చేశారు.
వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి వివేకా చిన్న త‌మ్ముడు. తిరుప‌తి ఎస్వీ ఆగ్రికల్చ‌ర‌ల్ వ‌ర్సిటీలో డిగ్రీ చేశారు. 1989, 1994ల‌లో పులివెందుల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1999, 2004 ఎంపీగా గెలిచారు. 2009లో ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు.