ఏపీలో భయానక దృశ్యాలు

June 04, 2020

విజయవాడ, విశాఖ వంటి నగరాల్లోని కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రబలంగా ప్రచారం చేస్తూ ఏపీలో సేఫ్టీ చర్యల్లో చాలా ముందుందని వైసీపీ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. కానీ ఈరోజు ఏపీలో కనిపించిన దృశ్యాలు చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీలో కరోనా ఊరూ వాడా విస్తరించే ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ఏపీ సర్కారు నిర్లక్షమే కారణం అని జనం విమర్శిస్తున్నారు. 

అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వలంటీర్లు తమ బాధ్యతలను మరిచి నిద్రిస్తున్నారు. దీంతో సామాజిక దూరం కేవలం ఒక ప్రచార అస్త్రంగా మారింది ఏపీలో. ఆ నిర్లక్ష్యానికి ఈ కింది ఫొటోలే సాక్షీబూతాలు.