పదవిపై మోజు కోల్పోయిన మంత్రులు

September 17, 2019

జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కలేదని కొందరు ఏడుస్తుంటే... మంత్రి పదవి వచ్చిన వాళ్లు కూడా ఏం చేసుకోవాలని ఏడుస్తున్నారట. అదేంటి వారికేమయ్యింది. జీవితంలో ఊహించని పదవి... అంతకంటే ఏం కాావాలి అనుకుంటున్నారా? అదే కదా ట్విస్టు. పదవి వచ్చిన శాటిస్ఫాక్షనే లేక ఉసూరుమంటున్నారట జగన్ కేబినెట్ మంత్రులు. రోజురోజుకు జగన్ వ్యవహరిస్తున్న తీరే దీనికి కారణం. 

మొన్నటి ప్రమాణ స్వీకారం రోజునే మంత్రి పదవులు రెండున్నరేళ్లే ఉంటాయి. తర్వాత మారుస్తానని జగన్ ప్రకటించడంతో అందరూ షాక్ తిన్నారు. శాఖలో విషయాలు అర్థం కావడానికే ఏడాది అవుతుంది. రెండున్నరేళ్లు పదవంటే ఎలా అని అసంతృప్తికి గురయ్యారు. కాకపోతే అంతకుమించి ఆప్షన్ లేదు కాబట్టి వారు చేసేది కూడా ఏం లేదు. అయితే, టెక్నికల్ గా ఇది రాంగ్... మంత్రి పదవిలో అనుభవం శాఖకు మంచిదే గాని ప్రాబ్లం కాదు. మంత్రులు అవినీతి చేస్తారని పదవులు మార్చడం అవివేకం. అవినీతి కంట్రోల్ చేస్తే తగ్గుతుంది గాని మనిషిని మారిస్తే కొత్తవాడు చేయడని గ్యారంటీ ఏమిటి? అందుకే దీనిపై విమర్శలు వస్తున్నాయి. 

తొలి మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఊహించ‌ని రీతిలో మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు పవన్. త‌ప్పు చేస్తే తాను ఉపేక్షించ‌నని.. రెండున్న‌రేళ్లు మంత్రులుగా అవ‌కాశం ఉంటుందని చెబితే... ఏం చేసినా రెండున్నరేళ్లు ఉంటారని అర్థం కాదన్నారు.  ఆరోప‌ణ‌లు,  త‌ప్పు చేసిన‌ట్లు తేలితే మంత్రి ఎవ‌రినైనా ఎపుడైనా స‌రే పీకి పారేస్తా అని మంత్రివర్గంలోనే వార్నింగ్ ఇచ్చారు జగన్. ప్ర‌జ‌లు మార్పు కోరుకొని పార్టీకి అఖండ విజ‌యాన్ని అందించార‌ని... వాళ్లు మనల్ని మరోసారి నమ్మాలంటే మన నిజాయితీ వారికి అణువణువునా కనిపించాలన్నారు.   

జగన్ పదవి ఇచ్చినట్లే ఇచ్చి నిద్రలేకుండా చేస్తున్నారని... మంత్రులు ఉసూరుమంటున్నారు. రాజన్నరాజ్యం అంటే... చక్కగా అప్పటిలా ఉంటుందనుకున్నాం గాని మనోడితే కష్టమే అన్నట్టు ఫీలవుతున్నారట. దీంతో ఈ పదవి ఉన్నా ఊడినా పోయేదేం లేదన్నట్లు మంత్రులు ఫీలవుతున్నారు.