దేశం పరువు తీస్తున్నావు జగన్ - నిర్మలమ్మ

August 13, 2020

జగన్ ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ బీజేపీ - జగన్ దోబూచులాటను ఇక ఎంత మాత్రం సహించేది లేదని కేంద్ర పార్టీ స్పష్టంగా సంకేతాలు పంపుతోంది. ఇంతవరకు ఏమైనా సంబంధాలు పెట్టుకుని ఉంటే ఇక్కడితో ఆపండి, ఇకపై కుదరదు అన్నట్టు బీజేపీ పరోక్ష సంకేతాలను ఏపీ బీజేపీ నేతలకు ఇస్తోంది. అందుకే నేరుగా కేంద్ర పార్టీ కీలక నేతలు రాష్ట్రంలో జగన్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు.

ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక పనిచేసే ముందు దేశాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఏపీ కూడా భారతదేశంలో ఒక భాగం అని... ఒక రాష్ట్రం చర్యల వల్ల దేశం నస్టపోకూడదు అని నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత‌ర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాల‌ను రాష్ట్రాలు గుర్తు పెట్టుకోవాలి... రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో భార‌త్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా  ఇబ్బంది రాకుండా చూడాలి అని నిర్మ‌లాసీతారామ‌న్ హెచ్చరించారు.

రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉంది. ఏపీకి ఏప్రిల్ నుంచి రూ.8 వేల కోట్లు ఇచ్చాం అని ఆమె వెల్లడించారు.  పోలరంపై పరోక్షంగా ప్రస్తావిస్తూ... అక్ర‌మాలు తేల్చుతామ‌ని జ‌గ‌న్ చెప్పారు, మంచిదే.. కానీ, వ‌ర‌ల్డ్ బ్యాంక్ నిధుల‌తో న‌డిచే ప్రాజెక్టులు ఇబ్బందులు ప‌డ‌కుండా చూడాలి అని విమర్శించారు. అంటే ముందు ప్రాజెక్టు కట్టు మిగతాది తరువాత తేలుద్దువు గాని అన్నట్లు ఆమె భావమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఏపీకి కేంద్రం యూనిట్ విద్యుత్ ను రూ.2.70 కి ఇస్తోంది. ఏపీలో యూనిట్‌కు రూ.8,  రూ.9 ఛార్జ్ చేస్తున్నారు. యూనిట్‌కు రూ.9 చెల్లించి ప్ర‌జ‌లు ఎలా బ‌తుకుతారు? వ్యాపారాలు ఎలా చేసుకుంటారని నిర్మ‌లా సీతారామ‌న్ నిలదీశారు. 

తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీపై బీజేపీ కన్ను పడింది. గతంలో స్వయంగా ప్రధానే మా పార్టీని ఏ రాష్ట్రంలోను తక్కువ అంచనా వేయొద్దున్నారు.  అయితే ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్, తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

గత కొద్ది రోజులుగా వైసీపీపై బీజేపీ స్వరం మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా అంతే ఘాటుగా జగన్ పై విమర్శలు చేయడంతో బీజేపీ ఇక జగన్ తో తెగదెంపులు చేసుకున్నట్టే అని అర్థమవుతోంది.