జగన్ మాట తప్పి మోసం చేశారు- చంద్రబాబు

August 09, 2020

అమరావతిని నాశనం చేస్తూ జగన్ చేసిన తప్పు అత్యంత దుర్మార్గమైనదని, భవిష్యత్తులో  ఇకపై ప్రజలు ప్రభుత్వాలను నమ్మరు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి భూముల సేకరణకు ముఖ్యమంత్రి హోదాలో చేసుకున్న ఒప్పందాలకు విలువ లేకపోతే ఇక ప్రభుత్వాలను ఎవరైనా ఎందుకు విశ్వసిస్తారు అని చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రానికి రాజధాని పెడదాం అంటే... అమరావతి రైతులు భూములిస్తామని ముందుకొచ్చారని, వారి గొప్ప మనసును అపహాస్యం చేసి, ప్రజల ఆశలను జగన్ సర్వనాశనం చేశారని చంద్రబాబు తప్పుబట్టారు. జగన్ రెడ్డిది  దుర్మార్గమైన ఆలోచన అని, దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని గుర్తుచేశారు. 

అసెంబ్లీ సాక్షిగా గతంలో ముఖ్యమంత్రి జగన్ అమరావతిని రాజధానిగా ఒప్పకున్నది నిజంకాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. 30 వేల ఎకరాల్లో రాజధాని పెట్టాలని అడిగింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. ఈరోజు మాటతప్పారని, మడమ తిప్పారని దుయ్యబట్టారు. ఒక దుర్మార్గమైన విధానంలో వేలమంది రైతుల భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

గవర్నర్ తీరుపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో అనైతిక పాలనపై గవర్నర్‌ బిశ్వభూషన్‌కు ఫిర్యాదుచేస్తే పట్టించుకోలేదని, ఈ రోజు గవర్నరే రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారని చంద్రబాబు విమర్శించారు.   

గవర్నర్ ది చారిత్రక తప్పిదం- ఆనంద్ బాబు

3 రాజధానుల బిల్లును ఆమోదించి గవర్నర్ చారిత్రక తప్పిదానికి ఒడిగట్టారని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు ప్రకటించారు. న్యాయస్థానాల ముందు ఈ బిల్లులు నిలబడవని నొక్కి చెప్పారు. వీటికి చట్టబద్ధత లేదన్నారు. ప్రజల అభిప్రాయాలను కూడా ఈ బిల్లుల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌పై గవర్నర్ తీవ్రంగా దెబ్బ కొట్టారని వ్యాఖ్యానించారు. సంతకాలు ఉద్యమాలను ఆపలేవన్నారు. ఇది చెత్త బుట్టలోకి వెళ్లే బిల్లే అని  అన్నారు.

Read Also

3 capitals: ఏపీ బీజేపీ అధ్యక్షుడి స్పందన ఇదే
పాపం ఆయన.. పులుసులో ములక్కాయ అయ్యారుగా?
CRDA : రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం !