రైతులకు డబ్బు ఎగ్గొట్టిన మొనగాడు జగన్ - సీబీఎన్

August 12, 2020

రైతలకు ఏడాదికి 12500 ఇస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చాక యుటర్న్ తీసుకున్న జగన్ రైతు దినోత్సవం జరపడం హాస్యాస్పదం అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు.

అన్నదాత సుఖీభవ పథకాన్ని పేరు మార్చి రైతు భరోసా అని చెప్పి వారికి డబ్బులు ఎగ్గొట్టిన మొనగాడు జగన్ అని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ మాట మార్చి 7500 మాత్రమే ఇస్తున్నారని అన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ కిసాన్ పథకం ద్వారా రైతులకు నేరుగా ఇస్తున్న 6000 రూపాయలను తన క్రెడిట్ కింద వేసుకుని తాను ఇవ్వాల్సిన 6 వేలు జగన్ ఎగ్గొట్టారని చంద్రబాబు ఆరోపించారు

 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే... రైతులకు లక్షా 20 వేలు వచ్చేవి.

కానీ జగన్  ఐదేళ్లలో రైతులకు ఇచ్చే సొమ్ము కేవలం 37500 మాత్రమే అని చంద్రబాబు విమర్శించారు. 

ఇంతే కాదు... అందరి రైతులకు ఇవ్వడం లేదు అన్నారు.

పది లక్షల మంది రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇలా మోసం చేసిన జగన్  మరోవైపు అమరావతి రైతులను కూడా దగా చేశారన్నారు.

ఇంత మంది రైతులను మోసం చేసి రైతు దినోత్సవం జరుపుతున్నారని చంద్రబాబు విమర్శించారు

 అమరావతి కోసం 34 వేల ఎకరాలను ఇచ్చిన రైతులను జగన్ రోడ్డు కీడ్చాడని అన్నారు.