`కటింగ్ మాస్టర్` జగన్ పై లోకేశ్ సెటైర్...వైరల్

June 01, 2020
CTYPE html>
తమది బీసీల పక్షపాత ప్రభుత్వమని....అన్ని రకాల పదవుల్లో బీసీలకు మెజారిటీ సీట్లు కేటాయించామని సీఎం జగన్ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న సుప్రీం కోర్టు తీర్పును కూడా పెడచెవిన పెట్టిన వైసీపీ ప్రభుత్వం....స్థానిక సంస్థల్లో 59 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించింది.  అయితే, తీరా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆ రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితమయ్యాయి.
దీంతో, గతంలో 34 శాతం రిజర్వేషన్లు పొందిన బీసీలు...జగన్ హయాంలో 24 శాతానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైరికల్ ట్వీట్ వేశారు. జగన్ ను టైలర్ తో పోల్చిన లోకేశ్....రిజర్వేషన్లకు కత్తెర వేశారంటూ వ్యంగ్యంగా వేసిన కార్టూన్ ను ట్వీట్ చేశారు. 
 
`బాబు టైలర్స్‌.. జగన్‌ టైలర్స్‌' అంటూ జగన్ పై ఆసక్తికర కార్టూన్ ను లోకేశ్ పోస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై జగన్‌ తీరును లోకేశ్ ఎద్దేవా చేశారు. టైలర్లుగా చంద్రబాబు, జగన్‌ కనపడుతున్న ఆ కార్టూన్లలో దుస్తులు కుట్టించుకోవడానికి బీసీలు వచ్చినట్లుగా కనబడుతోంది. చంద్రబాబు పర్ ఫెక్ట్ స్టిచింగ్ మాస్టర్ అని...బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి సరిపోయే దుస్తులుకుట్టించినట్లుగా కార్టూన్ వేశారు. ఇక, వైఎస్‌ జగన్ మంచి కటింగ్ మాస్టర్. చట్టబద్ధంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసి 24 శాతానికి తగ్గించారని కురచ బట్టలతో సింబాలిక్ గా చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జగన్, బాబు టైలర్స్ ట్వీట్ వైరల్ అవుతోంది.