కేసేసింది రెడ్డి... నిందేమో బాబు మీద

June 05, 2020

రాష్ట్రంలో విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఎలాగైనా స్థానిక ఎన్నికలు వాయిదా వేయించాలన్న వ్యూహంతో వైసీపీ చేసిన కుట్రలు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాయని తెలుగు దేశం నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగం 50 శాతానికి మించి రిజర్వేషన్లను పర్మిట్ చేయదని తెలిసి కూడా బీసీలను మోసం చేయడానికి పబ్లిసిటీ కోసం జగన్ 59 శాతం రిజర్వేషన్లు ప్రకటించారని టీడీపీ ఆరోపించింది. ఇది కేవలం కోర్టులో ఎన్నికలు వాయిదా వేయడానికి వేసిన ప్లాన్ అని విమర్శించారు.

సాధ్యం కాని రిజర్వేషన్లు ప్రకటించింది జగన్ రెడ్డి

వాటిని అడ్డుకుంటూ కోర్టులో కేసు వేసింది రెడ్డి సంఘం అధ్యక్షుడు బిర్రు ప్రతాప్ రెడ్డి...

కానీ వైసీపీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు కేసు వేయించాడని ప్రచారం చేస్తున్నారు. అసలు రెడ్డి సంఘం అధ్యక్షుడు ఎవరు చెబితే వింటారో ఏపీ ప్రజలు అందరికీ తెలుసు అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి... బాబుపై నిందలు వేయాలని ప్రయత్నించినంత మాత్రాన నమ్మడానికి ఏపీ ప్రజలేం అమాయకులు కాదని హెచ్చరించారు. మొన్నటివరకు చెవిలో పువ్వులు పెట్టారు, ఇపుడు ఏకంగా పెద్దపెద్ద క్యాబేజీ పూలు పెడుతున్నారని బుద్ధా మండిపడ్డారు.

జగన్ కు బీసీలపై ప్రేమ ఉంటే...  హైకోర్టు రిజర్వేషన్లు ఆపడంపై సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడాలి కాని... ఏం చేస్తాం, కోర్టు చెప్పింది అంటూ బాధగా ఎన్నికలు పెట్టడం ఏంటి? డ్రామాలు కాకపోతే అని బుద్ధా ఎద్దేవా చేశారు. 

కొసమెరుపు : 59 శాతం రిజర్వేషన్లపై కేసులు వేసిన వ్యక్తుల్లో ఒకరు రెడ్డి సంక్షేమ సంఘ కన్వీనర్ అయిన ప్రతాప్ రెడ్డి..YSR, జగన్, బొత్సలకు చాలా సన్నిహితులు. అంతేకాదు.. ఈ కేసు ఇంకొకరు కూడా వేశారు. ఆయన పేరు రామాంజనేయులు. అతను రాప్తాడు మండలం వైసీపీ కన్వీనర్.