బాబు అనుమానం నిజమే... జగన్ నేమ్ ప్లేట్ సిద్ధం

July 20, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఈవీఎంలు పనిచేయకపోవడంపై ప్రజలు ఆందోళన ఛెందుతున్నా, అధికార పార్టీ ఆందోళన చెందుతున్నా ప్రతిపక్షం స్పందించడం లేదు. పైగా ఈసీ అద్భుతంగా పనిచేసిందని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి కితాబు కూడా ఇచ్చారు. అయితే... ఈసీయే సరిగా భద్రత కల్పించలేకపోయాం అని సారీ చెబితే వైసీపీ ఈసీ బాగా పనిచేసిందని చెప్పడం ఏంటి?

ఇవన్నీ ఒకెత్తు ఎన్నికల ఫలితాలు రాకముందే బైబై బాబు అని క్లాక్ లు ఏర్పాటుచేశారు, ఇపుడేమో ఎన్నికలు ముగిసి ఫలితాలు రాకముందే నేమ్ ప్లేట్ సిద్ధం చేశారు. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అంటూ తెలుగు, ఇంగ్లిష్‌లో రాసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఎన్నికల్లో గెలుపు మీద ఏ పార్టీ అయినా ధీమాగా ఉండటం తప్పులేదు. కానీ వైసీపీ ప్రవర్తన చూస్తుంటే...ఎన్నికలు అనేవి కేవలం ఫార్మాలిటీ మాత్రమే అని... ఆల్రెడీ సెటప్ అంతా చేసేశాం ఇక ఉత్తిత్తినే ఫలితాలు ప్రకటించాల్సి ఉంది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అసలే దేశ వ్యాప్తంగా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ జగన్ పార్టీ నేమ్ ప్లేట్ రెడీ చేయడం చూస్తుంటే... కచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని... అయితే కొన్నిచోట్ల వారి అవకతవకల్లో తప్పు ప్రోగ్రామింగ్ జరగడం వల్ల టీడీపీ ఓటు వైసీపీకి వెళ్లినట్లు కనిపించందని... కానీ... టీడీపీ ఓటు టీడీపీకి పడినా... టెక్నికల్గా అది వైపీపీకే పడినట్లు అనుమానాలు వ్యక్తంచేస్తోంది టీడీపీ. వారి అనుమానం, వీరి అత్యుత్సాహం చూస్తుంటే... ఏదో తేడా జరుగుతున్నట్లే కనిపిస్తోంది.