ఇది కదా జగన్ అంటే...

May 25, 2020

ఉమ్మడి రాష్ట్రంలో కూడా 13 జిల్లాలలో ఇన్ని సీట్లు సాధించిన చరిత్ర ఎవరికీ లేదు. అలాంటి చరిత్రను జగన్ సృష్టించారు. ఒక అప్రతిహత మెజారిటీ ఉన్న ప్రభుత్వం అడుగులు 50 రోజుల పాలన తర్వాత ఎలా ఉండాలి? ...
కత్తి యోధుడికి ఇస్తే యుద్ధం చేస్తారు. మరి సామాన్యుడికి ఇస్తే... కూరగాయలు కోసుకోవడానికి కాస్త పెద్దగా ఉందే అని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడతాడు.

రాష్ట్రం పరిస్థితి ఇదే. నాకు 25 ఎంపీలు ఇస్తే... ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి తీసుకువచ్చి మీకాళ్ల ముందు పడేస్తాను అని జగన్ బాకా ఊదారు. జగన్ ది మడమ తిప్పని వంశం అనుకుని జనం నిజంగానే ఇచ్చేశారు. మాట ఇచ్చినట్లే కేంద్రం మెడలు వంచారు గానీ... పాపం ప్రత్యేక హోదా కోసం కాదు. తన రహస్య వ్యాపార పార్టనర్ నిమ్మగడ్డ ప్రసాద్ కోసం... ఆయన కేంద్రం మెడలు వంచినంత పనిచేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలపై జనం గోల చేస్తుంటే ఫిడేలు వాయించుకుంటూ కూచున్న జగన్... నిమ్మగడ్డ సెర్బియాలో అరెస్టు అయిన వెంటనే అన్ని పనులు హఠాత్తుగా వదిలేసి ... ఆయనను కాపాడే పనిలో పడ్డారు. సరే కాపాడారా లేదా అన్నది తర్వాత విషయం. ఇక్కడ జగన్ తాపత్రయం గమనించాలి.

ప్రత్యేక హోదా గురించో ఇంకో దాని గురించే పార్లమెంటులో లింగులిటుకు మంటూ ఒక్కో ఎంపీ మాత్రం సంప్రదాయంగా ప్రశ్నలు వేస్తారు. కానీ నిమ్మగడ్డ అరెస్టు అయిన వెంటనే అదేదో ప్రజల అత్యవసర సమస్య అన్నట్టు వైకాపా 22 మంది ఎంపీల తరఫున ఢిల్లీలో అందుబాటులో ఉన్న వైకాపా ఎంపీలంతా కలిసి నిమ్మగడ్డ ప్రసాద్ ను విడిపించడానికి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ను కలిశారు. నిమ్మగడ్డకు వీళ్లే క్లీన్ చిట్ ఇస్తూ ‘‘నిరాధారమైన కేసులో నిమ్మగడ్డను సెర్బియా రాజధానిలో అరెస్టు చేశారని, అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ద్వారా చర్యలు తీసుకోవాలని’’ కోరారు. మరి ఈ 22 మంది ఎంపీల్లో ఎంత మంది చదువుకున్నారో తెలియదు గాని... వారు నిజంగా చదువుకున్న అజ్జానులే.
ఒక నేరంలో అరెస్టు చేస్తే... అది వేరే దేశం రిక్వెస్టు చేసిన వెంటనే విడుదల చేస్తారా? ఈ కనీస జ్జానం లేకుండా వీళ్లు చేసిన రిక్వెస్టును బట్టే దీనికి ఇంకేదో కారణం ఉందని అర్థం చేసుకోవాలి. అలా ఆరాతీస్తే అర్థమైన విషయం ఏంటంటే... సెర్బియా పోలీసులు అరెస్టు చేసిన కేసు వాన్ పిక్ ది అట. వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డ ఎ3 అయితే, జగన్, సాయిరెడ్డిలు.. ఎ1, ఎ2 అని తెలుస్తోంది. అలా ఈ అరెస్టు తమ అధినేతను ఎక్కడ ఇబ్బందుల్లోకి నెడుతుందో అన్న భయంతో హుటాహుటిన ఎంపీలు కేంద్రం వద్దకు పరుగెత్తుకువెళ్లారు.
వైసీపీ ఎంపీలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి గారు ఏం చెప్పారో తెలుసా? ‘‘అయ్యా మీరు విడుదల చేయించమని అడుగుతున్నారు. ఇదేమీ చిల్లర వ్యవహారం కాదు. ఒక సివిల్ కేసులో అక్కడి పోలీసులు నిమ్మగడ్డను అరెస్టు చేశారు. కావాలంటే ... ఆయనను జైల్లో కలిసే ఏర్పాటుమాత్రమే మన దేశం తరఫున చేయించగలం గానీ విడుదల చేయమని కోరలేం’’ అని మంత్రి గారు మన వైకాపా ఎంపీలకు గడ్డి పెట్టి పంపారు.
ఇసుక సార్... అంటే ఆగు అంటారు
అన్న క్యాంటీన్లో భోజనం పెట్టట్లేదు సార్.. అంటే ఆగు అంటారు
ఉద్యోగాలు తీసేస్తున్నారు సార్... అంటే ఆగు అంటారు
పంటలకు నీళ్లు లేవు సార్... అంటే ఆగు అంటారు
కానీ
నిమ్మగడ్డను అరెస్టు చేశారు సార్... అంటే హడావుడిగా ఆయన విడుదల కోసం పార్టీని మొత్తం కదిలించారు జగన్. ఇది కదా జగన్ అంటే!