జగన్ కూతుళ్లకు కరోనా భయం

June 05, 2020

కరోనా... It comes, It goes...

2 రూపాయలు పెట్టి పారాసిటమల్ వేసుకోమని ఏపీ ప్రజలకు చెప్పారు

ఒక వేళ ఒంట్లో లేకుండా ఇంట్లో ఉంటే.... ఇంత బ్లీచింగ్ పౌడర్ దాని మొహాన కొట్టమన్నాడు.

ఇవన్నీ ఏపీ ప్రజలకు జగన్ చెప్పిన సూత్రాలు. కానీ... ఆయన మాట వినడంతో ఏపీలో పారాసిటమల్ కు, బ్లీచింగ్ పౌడరుకు విపరీతమైన గిరాకీ ఏర్పడి  స్టాకు అయిపోయింది.  ఆయన మాట మనమందరం విన్నాం గాని కూతుర్లు మాత్రం లెక్కచేయలేదరు. 2 రూపాయల పారసిటమల్ తో పోయేదానికి వాళ్లు పాపం లండన్ నుంచి వేలకు వేలు పోసి ఫ్లైట్ టిక్కెట్లు కొనుక్కుని వచ్చేశారు. అందుకే చెప్పేది పెద్దలమాట చద్దిమూట అని. వారు తమ తండ్రి మాట వింటే ఇంత ఖర్చయ్యేది కాదు.

ఆగండాగండి. కూతుర్లు జగన్ మాట వినకపోయినా... జగన్ మాత్రం కూతర్లను ఫాలో అయ్యారు. తన కూతుర్లు కరోనా గురించి చాలా ఎక్కువ భయపడ్డారే. అదేమైనా పెద్దదేమో అని మళ్లీ అనుమానం వచ్చిందో ఏమో జగన్ కి... వెంటనే స్కూళ్లు, కాలేజీలు మూసేయండి అంటూ ఆర్డరేశాడట ఈ సాయంత్రం. రేపటి నుంచి ఏపీలో అన్నీ బంద్. మొత్తానికి జగన్ కి కూతుర్లు జ్జానోదయం చేశారు అనుకోవాలి.