జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు క్యాన్సిలైంది?

August 08, 2020

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఇదిపుడు ఏపీలో హాట్ టాపిక్. అసలు సడెన్ టూర్ ఎందుకు పెట్టారు. మళ్లీ అది ఎందుు రద్దు అయ్యింది అని పెద్ద చర్చ జరుగుతోంది. ఫ్లైటెక్కడానికి సరిగ్గా 20 నిమిషాల ముందు జగన్ టూర్ రద్దయ్యింది.

పైకి జలవనరుల శాఖతో మీటింగ్ అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం కేంద్ర హోం మంత్రి బీజేపీ నెం.2 అమిత్ షాను కలవడమే అని విశ్వసనీయ సమాచారం. ఆయన షెడ్యూల్ సడెన్ గా మారిపోవడంతో జగన్ తో ఆయన అప్పాయింట్ మెంట్ రీషెడ్యూల్ అయ్యింది. అందుకే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా... మొన్ననే ఏపీ సీఎంకి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారంపై కేంద్రానికి వివిధ మార్గాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో దీనిపై కేంద్రం కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా న్యాయవ్యవస్థ పై వైసీపీ శ్రేణుల బహిరంగ దాడికి కేంద్రానికి బాగా కోపం తెప్పించిందని చెబుతున్నారు. 

అందుకే దీని విచారణ స్వయంగా సీఎంతో చేయడానికి జగన్ ను ఢిల్లీ పిలిపించారని ఢిల్లీ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే... అనేక అనిశ్చిత పరిస్థితులు, ఇంపార్టెంట్ మీటింగ్ ల వల్ల అమిత్ షా పెడ్యూల్ మారడంతో జగన్ మీటింగ్ రద్దయ్యింది అని చెబుతున్నారు. 

మరి మళ్లీ మీటింగ్ ఎపుడు ఉంటుందో ఇంకా తెలియడం లేదు.