జగన్ ఢిల్లీకి పోయాడు వచ్చాడు, వచ్చాడు... ఏమైంది???

February 25, 2020

జీతాల కోసం ఆంధ్రప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఇది అఫిషియల్ గా తెలిసిన నిజం. అందుకే కిన్లే వాటర్ వాడి డబ్బులు పొదుపు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.

కట్ చేస్తే...

అపాయింట్మెంట్ తీసుకోకుండా హోంమంత్రిని కలవడానికి ప్రత్యేక విమానంలో భారీ ఖర్చు పెట్టి జగన్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాశారు. లేదు పొమ్మన్నారు. అదే స్పెషల్ ఫ్లైట్లో తిరిగి ఆంధ్రకు వచ్చారు. దానికి ఏమేమో కారణాలు చెప్పారు. ఇంతకూ తెలిసింది ఏంటంటే హోంమంత్రి గారు అదేపనిగా మొహంచాటేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక ముఖ్యమంత్రి పర్యటన అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ప్లాన్ చేసుకుని వెళ్లాలి. ఆ పర్యటనకు రాష్ట్ర ప్రయోజనాలు ఉండాలి. గత ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానాల్లో తిరిగితే దుబారా అని విమర్శించిన సీఎం జగన్ రెడ్డి ఇపుడు తను మాత్రం పోలోమంటూ వెళ్లి వస్తున్నారు. కానీ ప్రయోజనం శూన్యం. ఎదుటి వారిపై చేసిన విమర్శలు గుర్తుకు రాలేదా మరి? 

ఇదిలా ఉండగా... సోషల్ మీడియా దెబ్బకు తన ఇంటికోసం కోట్లు కేటాయించిన జగన్ రెడ్డి ఆ జీవోలను విరమించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సోషల్ మీడియా దెబ్బకు తలొగ్గారు. పొదుపు పొదుపు అంటూనే అధిక ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రిగా సీఎం జగన్ రెడ్డి రికార్డులు బద్దలు కొడుతున్నారు.