జగన్ పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

August 03, 2020

ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది బజారు కాదు, మీ ప్యాలెస్ కాదు, అసెంబ్లీ అని గుర్తుంచుకుని మెలగాలని హెచ్చరించిన చంద్రబాబు... జగన్ కి గర్వం, కొవ్వు ఎక్కువ... అనుభవం జీరో. తన అనుభవ రాహిత్యం వల్ల ఇంతవరకు రాష్ట్రానికి ఒక్క మంచి పని కూడా చేయలేకపోయారని చంద్రబాబు ఆరోపించారు. 

నిరంతరం వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు తన జపం చేయడం, తనను నిందించడం తప్ప మరేమీ సాధించలేదన్నారు. తనను ఇరికించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. వారి వల్ల కావడం లేదు. అందుకే రాజకీయాల్లోకి ఉద్యోగులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, చీఫ్ మార్షల్ ని తాను దుర్భాలాడినట్లు ప్రచారం చేస్తున్నారు. నేను  అలాంటి మాటలు ఎన్నడూ మాట్లాడను. నేను తిట్టినట్టు కొందరు ఉద్యోగుల చేత స్టేట్ మెంట్లు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు చెబుతున్నా... ‘‘ఇది రాజకీయ వ్యవహారం, మీరు పొరబడి ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను ఎవరినీ దుర్భాషలాడను. ఒకవేళ అలా అన్నానని ఉద్యోగులు నిర్దారించుకుంటే సవరించుకోవడానికి సిద్ధం. చెప్పుడు మాటలు విని తప్పుడు సాక్ష్యాలు చెప్పొద్దు’’ అని చంద్రబాబు కోరారు. 

ఇంత జరుగుతున్నా స్పీకర్ కి బాధ్యత లేదు. ఆయన పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారు. హుందాతనం చూపడం లేదు. జగన్ ఆంబోతులా ఎగిరెగిరి పడుతున్నారు. కానీ స్పీకర్ చోద్యం చూస్తున్నారు అని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ప్రజలు అధికారం ఇచ్చింది వాళ్లకి మేలు చేయమని, మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోమని కాదు అని చంద్రబాబు హెచ్చరించారు.