జగన్ బండారం బట్ట బయలు.. గంటలో ఇరికించిన లోకేష్

February 24, 2020

గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రోగ్రెసివ్ కార్యక్రమాలు చేపట్టినపుడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రజలను తప్పుదారిపట్టించిన జగన్... ముఖ్యమంత్రి అయ్యాక తాజాగా గతాన్ని మరిచిపోయి, తెలుగుదేశం పథకాలే ప్రవేశపెట్టి జబ్బలు చరుచుకుంటారు. అత్యంత ఆశ్చర్యకరమై విషయం ఏంటంటే... ఈరోజు జగన్ పెట్టిన పథకాన్ని రెండేళ్ల క్రితం జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. పైగా తన సొంత పత్రిక సాక్షిలో కూడా దానిపై పనికిమాలిన విమర్శలు రాయించారు. ఇపుడు కొత్తగా చంద్రబాబు, వెంకయ్య పిల్లలు తెలుగు మీడియంలో చదివారా అని వింత వాదన మొదలుపెట్టారు.

అపుడు బాబు ఏం చేశారు?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మున్సిపల్ స్కూల్స్ ను ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ గా చేయాలని నిర్ణయించారు. అందులో తెలుగు సబ్జెక్టు మాత్రం తప్పనిసరి చేశారు. తద్వారా నగరంలో ఇతర విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలన్న సదుద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే... జనానికి మంచి జరిగితే చంద్రబాబు అభిమానులుగా మారిపోతారనేమో ఆనాడు జగన్ దానిని వ్యతిరేకించారు. తెలుగు భాషకు అవమానం, మాతృభాషకు మంగళం, ఎందుకింత తెగులు అని వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు. జగన్ కరడుగట్టిన అభిమాని అయిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అప్పట్లో చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సాక్షి పత్రికలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రాశారు. ఉద్యోగ సంఘాలను కూడా జగన్ రెచ్చగొట్టగా వారు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. చంద్రబాబు కోటరీలో నారాయణ, గంటా, సుజన వంటి వ్యాపారులు తప్ప జగన్ బ్యాచ్ లో లాగా నోరున్న నేతలు ఎవరూ లేరు. ఉన్నా అలాంటి వారిని చంద్రబాబు పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీంతో చంద్రబాబు ముందు చూపును గట్టిగా సమర్థించేవారు లేరు.

నాలుక మడతేసిన జగన్

తాజాగా అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓరి మీ అన్యాయం పాడుగాను. ఏం నాలుకయ్యా బాబు ... అపుడు ఇదే పని చంద్రబాబు చేస్తే తెలుగు మాయం, తెలుగుకు మోసం అన్నారు. ఇపుడు మొత్తం స్కూళ్లను ఇంగ్లిష్ లో నడుపుతారా? అది కూడా సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకుండా చేస్తే మొత్తం విఫలం అవుతుంది అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఇపుడు గతంలో తాను మాట్లాడిన మాటలు, సాక్షి పత్రికలో రాసిన రాతలు మరిచిపోయిన జగన్... చంద్రబాబు కొడుకు లోకేష్ తెలుగు మీడియంలా చదివారా? వెంకయ్య కూతురు తెలుగు మీడియంలో చదివారా? పవన్ కళ్యాణ్ పిల్లలు తెలుగు మీడియంలా చదివారా? అని వేదిక మీద ప్రశ్నిస్తే... పేటీఎం బ్యాచ్ తో సహా మేధావులు మొత్తం చప్పట్లు కొడుతున్నారు. అంతేగాని... అదేంటి జగన్.. కొన్నాళ్లు క్రితం తెలుగు చచ్చిపోతుందన్నావు, ఇంగ్లిష్ వద్దన్నావు.. ఇపుడిలా నాలుక మడతేసి మొత్తం ఇంగ్లిష్ మీడియం చేస్తానంటున్నావు ... మరి అపుడు నీ కూతురు తెలుగు మీడియం, ఇపుడు ఇంగ్లిష్ మీడియం చదువుతోందా? అని అంరదూ ప్రశ్నిస్తున్నారు. అయితే... వైసీపీలో అత్యధక యువనాయకులు పెద్ద వాయిస్ తో బయట మీడియాలో అరుస్తున్నారు. చంద్రబాబు నిర్ణయం ఆలోచన అమలు చేసిన జగన్ గొప్పోడు అయ్యాడు, అదే రెండేళ్ల క్రితం ఇదే నిర్ణయం ఒక పద్ధతి ప్రకారం అమలు చేసిన చంద్రబాబు ఎలా వృథా అయ్యాడు అని ప్రశ్నిస్తున్నారు. కనీసం తన పేపర్లో ఏం రాశానో అని కూడా జగన్ చూసుకోలేదా అని సోసల్ మీడియా ప్రశ్నిస్తోంది. దీన్ని బట్టి... చంద్రబాబును తప్పుడు ఆరోపణలు చేసి అదేపనిగా తప్పు దోవ పట్టించారన్న మాట అప్పటి ప్రతిపక్ష నేత జగన్. 

దీనిపై లోకేష్ కూడా స్పందించారు. ఆనాటి సాక్షి క్లిప్పింగులను కూడా జత చేశారు. 

అయ్యా గజిని జగన్ గారు.. మీ పవిత్ర పత్రిక, మీరు గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేసారు గుర్తులేదా? నగరపాలక పాఠశాలల్లో టీడీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి అని ప్రణాళిక సిద్ధం చేస్తే ఆరోజు మీరు అడ్డుపడ్డారు.