జగన్‌లో ఓటమి భయం! సంచలనంగా మారిన కామెంట్..

May 28, 2020

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్థి వైసీపీనే అంటున్నారు కానీ.. నిజానికి అలాంటి వాతాహవరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలంతా టీడీపీ వైపే చూస్తున్నారు. పాదయాత్ర ద్వారా ఇంతో అంతో పాప్యులారిటీ సంపాదించిన జగన్.. టీఆరెస్ తో దోస్తీ చేసి దాన్ని కూడా కోల్పోయారు. మరోవైపు ఆ పార్టీ కీలక నేతలు కూడా జగన్ తీరు పట్ల అసంతృప్తిగా ఉండటం వైసీపీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇక  ఎన్నికలకు మరో 25 రోజులే గడువు ఉన్నపటికీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆంధ్రకు రాకపోవడంతో పలు చర్చలు ఊపందుకున్నాయి. ఆయన హైద్రాబాద్ వీడకపోవడం వెనుక మర్మం ఏముందో తెలియక స్వయంగా వైసీపీ నేతలే గందరగోళానికి గురవుతున్నారు.


సరిగ్గా ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ తీరుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో అవి సంచలనంగా మారాయి. ‘జగన్‌ పోటీ చేసేది ఏపీలో.. నివాసం ఉండేది హైదరాబాద్‌లో’నని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు.. జగన్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి జగన్‌ చుట్టపు చూపుగా వస్తారని, జగన్‌లో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు చంద్రబాబు. మోదీ, కేసీఆర్ ఆదేశాల మేరకే వైసీపీ అభ్యర్ధుల ఎంపిక జరుగుతోందని బాబు పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్ధుల ఎంపికకు వేలం పాటే ప్రాతిపదిక అని, వేలంలో ఎవరెక్కువ పాడుకుంటే వాళ్లకే వైసీపీ టిక్కెట్లని, వైసీపీలో ఎస్సీ అభ్యర్ధులు రూ.10కోట్లు, ఓసీ అభ్యర్ధులను రూ.20 కోట్లు డిపాజిట్ చేయమంటున్నారని చంద్రబాబు చెప్పడం గమనార్హం. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, రాష్ట్రాన్ని, టీడీపీని దొంగదెబ్బ తీసే పార్టీగా వైసీపీ మారిందని చంద్రబాబు అన్నారు. 


మరోవైపు  ‘‘విజన్‌, రూట్‌ మ్యాప్‌, అమరావతి, పోలవరం, పేదల సంక్షేమం వంటి అంశాలతో చంద్రబాబు ముందుకు వెళ్తుంటే, జగన్‌ రాష్ట్రాన్ని దోచుకొనేందుకు అడుగులు వేస్తున్నారు. సీఎం పదవి వస్తే తప్ప అసెంబ్లీకి రానన్నట్లు వ్యవహరిస్తున్న జగన్‌ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఏ ఇరవయ్యో, ముప్పయ్యో సీట్లు వస్తే… జగన్‌ ఈసారైనా అసెంబ్లీకి వస్తారో, రారో చెప్పాలి’’ అని  ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు అంటున్నారు. ఇక ‘జగన్‌ గతం ఫ్యాక్షనిజం, వర్తమానం సీబీఐ, ఈడీ కేసులు, భవిష్యత్తు జైలే’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. దీంతో.. ఇవన్నీ చూస్తుంటే ఓటమి భయం తోనే జగన్ లోటస్ పాండ్ వదిలి బయటకు రావడం లేదని చెప్పుకుంటున్నారు జనం.