వైసీపీ మోసాన్ని లెక్కగట్టి మరీ చెప్పాడు

February 22, 2020

సమకాలీన రాజకీయాల్లో ప్రజలను బురిడీ కొట్టించడంలో వైసీపీ అధినేత జగన్ ది పీహెచ్ డీ. ప్రజలకు ఒకటి ప్రచారం చేసి, దానిని తన పేపర్లో రాయించి... మ్యానిఫెస్టో తయారుచేసేటపుడు మాత్రం చెప్పినవన్నీ అందులో రాయడం విస్మరించి ఓట్లన్నీ రాబట్టేశారు. ఏమడిగినా... మ్యానిఫెస్టో మీరు చదవలేదా? నేను ఆ మాట చెప్పలేదు కదా అంటాడు. నువ్వు చెప్పిన వీడియో సాక్ష్యం కూడా ఉంది అంటే... అదంతా కాదబ్బా మ్యానిఫెస్టోలో ఉందా లేదా అంటాడు. ఇక  ప్రత్యర్థులకు సౌండ్ లేని పరిస్థితి. చాలా టెక్నికల్ గా ప్రజలను మోసం చేశాడు జగన్. 

జగన్ వ్యూహాలను అర్థం చేసుకోలేకపోయిన టీడీపీ, జనసేన బోల్తాపడ్డాయి. ఏ మాట చెబితే... ఏ వర్గం, ఏ కులం ఎంత మేరకు మనకు దగ్గరవుతారు అని లెక్కలేసి మరీ వైసీపీ వ్యూహం పన్నింది. అందుకే 40 శాతం సీట్లు వచ్చి కేవలం 23 సీట్లు మాత్రమే రావడం అన్నది చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇక జనసేన పరిస్థితి చెప్పనక్కర్లేదు. అందుకే పవన్ కళ్యాణ్... ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతంతో... జగన్ హామీలతో జనం కళ్లు తెరిపించడానికి సిద్ధమయ్యాడు. ఎడతెరపి లేకుండా జగన్ పై దాడి చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. తాజాగా జగన్ పింఛను హామీపై జనాల్ని ఎలా బురిడీ కొట్టించిందీ చక్కగా వివరించండి. జగన్ ఎంత దారుణంగా మాట తప్పుతాడో ఆధారాలతో సహా నిరూపించాడు పవన్ కళ్యాణ్. ఆయన చేసిన ట్వీట్ ను కింద చూడొచ్చు.