పని చంద్రబాబుది, క్రెడిట్ జగన్ ది

February 22, 2020
CTYPE html>
ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందట. 
ప్రతి రాజకీయ నాయకుడి విజయం వెనుక ఒక అబద్ధం ఉంటుందట
కానీ జగన్ విజయం వెనుక, ముందు అబద్ధాలే ఉంటాయి
ఇది పచ్చినిజమని ఇపుడు జగన్ కి ఓటేసి మోసపోయిన జనం గగ్గోలుపెడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు చేసే అనేక పథకాలు ఎత్తేశారు. చివరకు వృద్ధుల పింఛన్లు కూడా కోస్తున్నాడు. చంద్రబాబు వస్తే ఛార్జీలు పెంచుతాడని చెప్పి తానే చార్జీలు పెంచాడు. అమరావతి 30 వేల ఎకరాల్లో కట్టమని చెప్పి తానే ఇపుడు వద్దంటున్నాడు. రైతులకు 12 వేలు ఇస్తానని చెప్పి ఆరువేలతో సరిపెట్టాడు. ఇలా ఒకటి రెండూ కాదు... పాదయాత్ర పొడుగునా నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చిన జగన్...  తనకు నచ్చినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాడు. ఇపుడు హామీ ఇచ్చావు కదన్నా ఎందుకు చేయవు అని అడిగితే... అయ్యో నా మేనిఫెస్టో చదవకుండా నువ్వు ఓటేశావా... సారీ అది నా మేనిఫెస్టోలో లేదంటాడు జగన్. ఇలా ప్రతి రోజు అబద్ధం, మోసం లేనిది ఒక్క అడుగు కూడా పాలన ముందుకు తీసుకోనివ్వడం లేదు. 
తాజాగా కడప పర్యటనలో ఉన్న జగన్... తన కళ్ల ముందే నాన్న శంకుస్థాపన చేసిన కడప ఉక్కు కర్మాగారానికి, ఎన్నికల ముందు చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఉక్కు కర్మాగారానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. పులివెందులకు తండ్రిలాగే నిధులు గుమ్మరించాడు. తండ్రి ఉన్నపుడు కడప జిల్లాలోని తన నియోజకవర్గం పులివెందులకు మాత్రమే డబ్బులిచ్చారు. ఇపుడు జగన్ వెనుకపడ్డ రాయలసీమలో మరింత వెనుకపడింది రాయచోటి అంటున్నాడు. మరి అదే జిల్లాకు చెందిన తన తండ్రి ఐదేళ్ల పాలనలో నీళ్లు కూడా దొరకని రాయచోటి ని ఎందుకు వైఎస్ పట్టించుకోలేదు. ఇపుడు కొడుకు వచ్చి మొసలి కన్నీరు కారిస్తే సరిపోతుందా? ఎన్టీఆర్ మొదలుపెట్టిన తాగునీటి పథకం హంద్రీనీవాను డబ్బులు సంపాదించుకునే ఆయుధంగా వైఎస్ మలచుకుంటే గత ఐదేళ్లలో ఆ కాలువ ద్వారా చిత్తూరు దాకా నీళ్లు తీసుకెళ్లారు చంద్రబాబు. అందులో పులివెందుల కూడా ఒకటి. 
ఇపుడు తాను 2 వేల కోట్లు ఖర్చు చేసి రాయచోటికి నీళ్లు ఇస్తాను అంటున్నాడు జగన్. ఇది చంద్రబాబు ఎపుడో చేసేశాడు. కానీ బాబు చేసిన పనిని జరగలేదని అబద్ధం చెప్పి ఇపుడు తాను చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అబద్ధమాడేశాడు. చంద్రబాబు హయాంలో ప్రణాళికలు రచించిన పనులకు శంకుస్థాపన చేసి తానే చేశాను అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు జగన్. రాష్ట్ర ప్రజలందరూ దీనిని నమ్మొచ్చేమో గాని రాయచోటి ప్రజలు నమ్మరు కదా. ముందుంది ముసళ్ల పండగ. ఐదేళ్లు తండ్రి అనాథగా ఎడారిగా వదిలేసిన ప్రాంతాలను చంద్రబాబు సస్యశ్యామలం చేస్తే... అదేంటి చంద్రబాబు పది చెంబుల నీళ్లు ఇస్తానంటాడా? నేను 11 చెంబులు ఇస్తా అంటూ గొప్పలకు పోతున్నాడు జగన్. జనం కనిపించేంత అమాయకులు కాదు.