జగన్ కి ఆ ఐడియాలు ఎలా వస్తున్నాయంటే

August 03, 2020

’’మద్యం రేట్లు పెంచితే మందు తాగడం మానేస్తారు‘‘

ఇది వైసీపీ తనకు తాను గొప్ప ఐడియాగా భావిస్తున్న విషయం. ఏ వస్తువయినా రేటు పెరుగుతూ ఉంటే డిమాండ్ తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక సూత్రం. కానీ... అన్నిటికీ ఒకటే మందు అన్నట్లు అన్ని సూత్రాలు అన్నిసార్లు పనిచేయవు. మనిషి అవసరం వేరు, సౌకర్యం వేరు, విలాసం వేరు. అవసరం ఎంత రేట్లు పెరిగినా కొనడం మానరు. ఒకవేళ ఉప్పు రేటు పెరిగితే మనం కొనడం మానేస్తామా? మానెయ్యం.

కారం రేటు పెరిగితే కొనడం మానేస్తామా... కొంతవరకు వినియోగం తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉప్పు లేకుండా బతకలేం కారం లేకుండా కొన్ని సార్లు సర్దుకోవచ్చు. నిత్యావసరాల్లోనే ఇంత తేడా ఉంటే.. మరి సౌకర్యం, విలాసం అనేటప్పటికి ఇంకెంత తేడా ఉంటుంది?

వైసీపీ చెబుతున్న మద్యం సూత్రం కూడా ఇదే. మద్యం అనేది వ్యసనం... దానిని మానడం అనేది అసాధ్యం. తాగుబోతు తనంతట తాను మానేస్తే మానెయ్యాలి తప్ప రేట్లు పెరిగితేనో ఇంకోటి పెరిగితేనో మానేసే పరిస్థితి ఉండదు.

దీనిపై తాజాగా టీడీపీ నేత అనిత మాట్లాడుతూ జగన్ పై భారీ పంచ్ వేసింది. ధరలు పెంచితే మద్యం తాగడం మానేస్తారని చెప్పడం అనేది బూటకపు ప్రచారం అన్నారు. ఇది వారి అవగాహన లేమికి, మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు. మహిళల్ని మోసం చేస్తున్నారని.... పేదల ఇంట్లో మద్యం మానకపోగా... ఇంతకుమందు 100 పెట్టి తాగొచ్చేవాడు ఇపుడు 175 పెట్టి తాగి ఇంటికి డబ్బులు ఇవ్వడం మానేస్తున్నాడని ఆమె  చెప్పింది.

జగన్ కి ఈ ఐడియాలు ఊరికే వచ్చిన ఐడియాలు కాదు... 16 నెలల పాటు జైల్లో గడిపిన అనుభవం వల్ల వచ్చిన ఐడియాలు ఇవి అన్నారు. ఈ పిచ్చి ఆలోచనలతోనే మద్యం పారించి ఆరెంజ్ జోన్లో ఉన్న విశాఖను రెడ్ జోన్లోకి మార్చారు అని అనిత విమర్శించారు.