ఢిల్లీకి జగన్... సడెన్ గా ఎందుకు?

May 26, 2020

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జగన్ భేటీ కానున్నారు. దీనిపై ఇంత సడెన్ గా ఎందుకు ప్రకటన వచ్చిందీ అన్నది తెలియదు గాని గవర్నెంటు ప్రకటనలో మాత్రం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించేందుకే జగన్ ఢిల్లీ టూర్ కు వెళుతున్నారని పేర్కొన్నారు. ఈసారి మోడీ అప్పాయింట్ మెంట్ తో పాటు పలువురు మంత్రుల అపాయింట్ మెంట్లు కూడా దొరికేశాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజే మోడీ ఎందుకు పిలిపించాడా అన్నది ఒక సందేహం. 

ఏపీలో దీనిపై పలు విశ్లేషణలు సాగుతున్నాయి. శాసన మండలిని రద్దుకు జగన్ సర్కారు విశ్వప్రయత్నం చేస్తోంది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టి రాష్ట్రపతి ముద్ర వేయించుకోవాలంటే మోడీ కరుణాకటాక్షాలు కావాలి. అందుకే చాలా రోజుల క్రితం టైం అడిగితే బుధవారం మోడీ టైం ఇచ్చారట. ఇక జగన్ సర్కారు ‘దిశ’ చట్టం కూడా కేంద్రం కొర్రీలు పెట్టి ఆపేసింది. సవరణలతో ఏపీ రాష్ట్రం మరోసారి కేంద్రానికి పంపింది. దీనిపై పెద్ద ఎత్తున ఏపీలో పబ్లిసిటీ చేసుకున్న జగన్ ... దాన్ని ఆమోదించుకోకపోతే అవమానాలు పడాల్సి వస్తుందని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు బిల్లుల కోసం మోడీని బతిమాలుకోవడానికి మన ముఖ్యమంత్రి ప్రయత్నం. ఢిల్లీ ఎన్నికల కథ ముగియడంతో బుధవారం ఎట్టకేలకు మోడీ అవకాశం ఇచ్చారు.