గ్రామ వాలంటీర్లకు జగన్ మార్క్ దసరా కానుక

July 07, 2020

ఏపీలో సంచలనంగా మారిన గ్రామ వాలంటీర్ల నియామకం సంగతి తెలిసిందే. తాజాగా వీరికి ఇస్తామన్న రూ.5వేల జీతాన్ని మార్చాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లు చెబుతున్నారు. వారి జీతాన్ని అనూహ్య రీతిలో పెంచాలన్న ఆలోచనలో ఏపీ సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే జగన్ చెప్పినట్లే.. అతి తక్కువ వ్యవధిలో నాలుగు లక్షల గ్రామ వాలంటీర్లకు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయటమే కాదు.. ఖాళీల్ని పూర్తిస్థాయిలో భర్తీ చేశారు. వారికి ఇస్తామన్న రూ.5వేల జీతానికి బదులుగా.. ఇప్పుడు రూ.8వేలకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతున్నట్లు చెబుతున్నారు.
గ్రామ వాలంటీర్లను నియమించిన జగన్.. తాజాగా గ్రామ.. వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేసే పనిలో పడ్డారు. అంతేకాదు.. ఈ నియామకానికి సంబంధించి విద్యార్హతను కూడా తగ్గించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. గ్రామ.. వార్డు వాలంటీర్లుగా పని చేస్తూ.. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారి కారణంగా ఏర్పడే ఖాళీల్ని సైతం ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్న ఆలోచనలో ఏపీ సీఎం ఉన్నారు. ఒకవేళ.. ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నట్లు.. గ్రామ వాలంటీర్ల గౌరవ వేతనం కానీ రూ.5వేల నుంచి రూ.8వేలకు పెరిగితే..అంతకు మించిన స్వీట్ న్యూస్ వారికి ఉండదనే చెప్పాలి.

Read Also

హుజూర్ న‌గ‌ర్‌లో గులాబీకి స‌మ్మె సెగ‌...!
కేసీఆర్ సంచలనం... ఆర్టీసీలో అందరికీ ఊస్టింగ్
లండన్  బతుకమ్మ,  దసరా సంబరాల రికార్డు