జగనా మజాకా : క్రిస్టియన్లకు మరో నజరానా

July 08, 2020

జగన్ పాలనలో మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని.. పాలనంతా క్రైస్తవ పక్షపాతంగా సాగుతోందని.. హిందూ ఆలయాలను కూల్చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇన్ని ఆరోపణలు వస్తున్నా సీఎం జగన్ మాత్రం దానిపై ఏమాత్రం స్పందించకపోగా క్రైస్తవులకు మరో నజరానా ప్రకటించారు.
జెరూసలెం వెళ్లే యాత్రికులకు ఆర్థిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో యాత్రికులకు ఆర్ధిక సాయం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జెరూసలేంతో పాటు ఇతర క్రైస్తవ ప్రార్ధనా స్ధలాల సందర్శనకు కూడా ఆర్ధిక సాయం అందించనుంది.ఇప్పటికే ఏపీ లో మత ప్రచారం ఎక్కువైందని ప్రతిపక్షాల తో పాటు ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యం లో జగన్ జెరూసలెం యాత్రికులకు ఆర్ధిక సాయం పెంచడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి జెరూసలెం వెళ్లేందుకు ఇచ్చే సాయం రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెంచిన జగన్ ప్రభుత్వం... రూ. 3 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈనిర్ణయం పై కోదిరోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్ లో చర్చించ్చిన ప్రభుత్వం నేడు ఉత్తర్వులను జారీ చేసింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నాయి. జెరూసలెం యాత్రికులకు ఆర్ధిక సాయం పెంపు విషయంలో ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచీ విమర్శలొస్తున్నాయి.