రాజ‌ధాని లాయ‌ర్‌కు 5 కోట్లు ఫీజు...ఇంట్లో డ‌బ్బులేనా జ‌గ‌న్‌?

May 27, 2020

అమ‌రావ‌తిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా తీర్చిదిద్ద‌డానికి బ‌దులుగా...మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ స‌ర్కారు దూకుడుతో ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, స‌ర్కారు మొండి నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ...అమరావతి పరిసరాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అయినా స‌ర్కారు మొండిగా ముందుకు సాగుతోంది. కోర్టుల్లో కూడా త‌మ‌కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌వ‌ద్ద‌ని కోరుకుంటూ...కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చుతో లాయ‌ర్ల‌ను ఏర్పాటు చేసుకుంటోంది. ఏకంగా ఐదుకోట్ల ఫీజు చెల్లించేందుకు లాయ‌ర్‌ను మాట్లాడేసింది.
అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని, రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులతో పాటు టీడీపీ, అమరావతి జేఏసీ కూడా అమరావతిని కొనసాగించాలని నిరసన వ్యక్తం చేస్తోంది. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు, మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ తదితర అంశాలపై కేసుల నమోద‌య్యాయి. వీటి విచారణకు జ‌గ‌న్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించింది. ఆయనకు రూ. 5 కోట్ల‌ ఫీజు చెల్లించ‌నుంది.
రాజ‌ధాని కేసులను రోహత్గీ వాదించనుండ‌టంతో స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంది. రోహత్గీ నియామ‌కంలో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు కూడా ఉన్నాయి. ఫీజు కింద  కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.అయితే, గ‌తంలో ప్ర‌భుత్వ ధ‌నం దుబారా పేరుతో ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేసిన జ‌గ‌న్‌..ఇప్పుడు మ‌రి త‌న నిర్ణ‌యం బెడిసికొట్ట‌కుండా ఉండేందుకు చెల్లిస్తున్న ఈ రూ.5 కోట్లు ఎక్క‌డివ‌ని..స‌హ‌జంగానే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి.