జగన్ ప్రభుత్వం కూలిపోతుంది- బాలయ్య

August 05, 2020

నందమూరి బాలకృష్ణ జగన్ ప్రభుత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. ఈ అరాచక పాలన ఐదేళ్లుండదని సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. నందమూరి తారకరారామారావు కుమారుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ పార్టీ కార్యకర్తలకు మహానాడు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్లు చేశారు. 

ఏపీ ప్రభుత్వ తీరు సరిగా లేదని చెప్పిన బాలకృష్ణ ఈ అరాచక ప్రభుత్వం అయిదేళ్లు అవసరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి పాలన ఐదేళ్లు నిలబడదు అన్నారు. త్వరలో ఎన్నికలు వస్తాయని, టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని బాలయ్య వ్యాఖ్యానించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రజలకు చేసిందేం లేదు, రాష్ట్రానికి చేసిందేం లేదు. చంద్రబాబు ఎన్టీఆర్ కలలను సాకారం చేశారు. అధికార పార్టీ అరాచక పాలన అంతం అవుతుందన్నారు.

టీడీపీ కార్యకర్తలకు బాలయ్య అద్భుతమైన సందేశం ఇచ్చి ఉత్తేజ పరిచారు. అత్యంత నమ్మకమైన బలమైన కార్యకర్తలు దేశంలో టీడీపీ కి మాత్రమే ఉన్నారని చెప్పిన బాలకృష్ణ ఎన్టీఆర్ కు వారసులు మేము కాదని, కార్యకర్తలే ఎన్టీఆర్ వారసులు అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో బాలయ్య అందరినీ ఆకట్టుకున్నారు. కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. 

ఎవరికీ భయపడకండి. నా అవసరం ఎక్కడ ఉన్నా నేను వస్తాను అంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు నందమూరి బాలకృష్ణ.